మిర్యాలగూడ : 50 రోజుల్లో రూ.14 వేల కోట్ల అప్పు.. రేవంత్ పై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లో 14 వేల కోట్ల అప్పు చేశారని బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

మిర్యాలగూడ : 50 రోజుల్లో రూ.14 వేల కోట్ల అప్పు.. రేవంత్ పై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

మిర్యాలగూడ , మన సాక్షి :

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లో 14 వేల కోట్ల అప్పు చేశారని బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ నువ్వు ఎంత రండవో అన్నాడు.

మొనగాడివైతే ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. నిజమైన రండ నువ్వు అంటూ మండిపడ్డారు. జానెడున్నావు ఎగిరెగిరి పడకు అంటూ సెటైర్లు కూడా వేశారు. నువ్వేమన్నా ధర్మ పోరాటం చేసి గెలిచావా..? రెండు టర్ములు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ఒకసారి మీ పార్టీకి ఓటేద్దామని అనుకొని ఓట్లు వేశారని అన్నారు. మీది నడుమంత్రపు సంసారం అని… అన్నారు.

ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ పార్టీని ప్రభుత్వాన్ని కూల్చుతారని వ్యాఖ్యానించడం పొరపాటు అన్నారు. మీ ప్రభుత్వాన్ని మేమెందుకు కూల్చుతామని, మీ వారే కూల్చుతారని.. లేదంటే ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజలే కూలుస్తారని అన్నారు.

డిసెంబర్ 9వ తేదీన రైతుల రుణమాఫీ చేస్తామని, రైతు బంధు ఎకరాకు 15000 రూపాయలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటివరకు అవి అమలు చేయలేదన్నారు. రైతుబంధు అడిగితే ఒక మంత్రి చెప్పుతో కొడతా అంటున్నాడని, మరి ఎవరిని చెప్పుతో కొడతారో చూద్దామన్నారు. ఇప్పుడు ఆ మంత్రికి ప్రజలే బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు.

సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, సభాధ్యక్షులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, మాజీ ఎమ్మెల్యేలు తిప్పన విజయసింహారెడ్డి , రవీంద్ర నాయక్, కంచర్ల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి, నల్లమోతు సిద్ధార్థ, చింత రెడ్డి శ్రీనివాసరెడ్డి , గుత్తా అమిత్ రెడ్డి నియోజకవర్గ , మండల, పట్టణ, స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచులకు మంత్రులు ఘనంగా సన్మానం చేశారు.