ఉచిత విద్యు త్ కావాలంటే ఆధార్ తో పాటు ఇవి ఉంచుకోండి.. నేటి నుంచి ఇంటి వద్దకే విద్యుత్ అధికారులు..!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కృషి చేస్తుంది. ఇటీవల మంత్రివర్గంలో కూడా గ్యారెంటీ హామీలను అమలు చేయడానికి తీర్మానాలు కూడా చేశారు.

ఉచిత విద్యు త్ కావాలంటే ఆధార్ తో పాటు ఇవి ఉంచుకోండి.. నేటి నుంచి ఇంటి వద్దకే విద్యుత్ అధికారులు..!

మన సాక్షి , నెట్ వర్క్ :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కృషి చేస్తుంది. ఇటీవల మంత్రివర్గంలో కూడా గ్యారెంటీ హామీలను అమలు చేయడానికి తీర్మానాలు కూడా చేశారు. ఇప్పటికే రెండు గ్యారెంటీ హామీలను అమలు చేస్తుండగా మరో రెండు గ్యారెంటీ హామీలను త్వరలో అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ALSO READ : Telangana : తెలంగాణలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. నిబంధనలు ఇవేనా..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రిమండలి ఆమోదం సైతం చేశారు. ఇటీవల అభయహస్తం ప్రజా పాలన ద్వారా దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. పేదలకు గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందించడానికి ప్రభుత్వం నిర్ణయించిన విషయం విధితమే. కాగా గృహలక్ష్మి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందాలంటే ఇవి తప్పనిసరిగా ఉండాలి.

ఈనెల 6వ తేదీ (నేటి నుంచి) 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడానికి విద్యుత్ అధికారులు పత్రాలను సేకరించడానికి ఇంటి వద్దకే రానున్నారు. ఆ సమయంలో విద్యుత్ వినియోగదారులు ఉచిత విద్యుత్ పొందడానికి సిద్ధంగా పత్రాలను ఉంచుకోవాలి.

ALSO READ : మిర్యాలగూడ : 50 రోజుల్లో రూ.14 వేల కోట్ల అప్పు.. రేవంత్ పై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

ఈరోజు నుండి గృహ జ్యోతి పథకం అనగా కరెంటు 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వటానికి మీ సొంత ఇంటికి రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ ఇవ్వగలరు.
మరియు కిరాయికి ఉన్నవారు ఓనర్ కరెంటు మీటర్ నెంబర్, కిరాయికి ఉన్న వారి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, సెల్ నెంబర్ వారు కూడా *కరెంట్ బిల్లు ఇచ్చేటప్పుడు (Current Bill* issue) మీరు మీ యొక్క food security card(ration card) రేషన్ కార్డ్, ఆధార్ card No. and mobile number, సెల్ నెంబర్ చెప్పగలరు.

పత్రాలు అందజేయడానికి వినియోగదారులు సహకరించగలరని అధికారులు కోరుతున్నారు.

ALSO READ : BREAKING : బైక్ తో సహా వ్యక్తి సజీవ దహనం..!