Breaking Newsఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

YS JAGAN : మాజీ సీఎం జగన్ కేసులో కీలక మలుపు.. నేడు నాంపల్లి కోర్టుకు హాజరు..!

YS JAGAN : మాజీ సీఎం జగన్ కేసులో కీలక మలుపు.. నేడు నాంపల్లి కోర్టుకు హాజరు..!

మన సాక్షి హైదరాబాద్ :

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో కీలక మలుపుగా చెప్పవచ్చును. సిబిఐ, ఈడి కేసుల్లో నిందితుడుగా ఉన్న వైయస్ జగన్ గురువారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుకానున్నారు. ఆయన నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరుకానున్నారు. అందుకు గాను నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు హాల్లోకి కేవలం న్యాయవాదులను మాత్రమే అనుమతిస్తున్నారు.

జగన్ సిబిఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు మినహాయించాలని కోర్టుకు వెళ్లగా సిబీఐ కోర్టు తిరస్కరించింది. నవంబర్ 21వ తేదీలోగా జగన్ కోర్టులో హాజరుకావాలని కోర్టు ఆదేశించినప్పటికీ ఒకరోజు ముందుగానే హాజరుకావాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆరేళ్ల తర్వాత ఆయన నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరవుతున్నారు. 2013 సెప్టెంబర్ నుంచి ఆయన బెయిల్ పై ఉన్నారు.

MOST READ : 

  1. TG News : కారుకు సైడ్ ఇవ్వలేదని తండ్రి వయసున్న ఆర్టీసీ డ్రైవర్ పై కాలితో తన్ని దాడి.. (వీడియో వైరల్)

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి పరిశీలన..!

  3. District collector : ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి..!

  4. Miryalaguda : మంత్రులకు ఘన స్వాగతం.. భారీ ర్యాలీతో దద్దరిల్లిన మిర్యాలగూడ..!

మరిన్ని వార్తలు