TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

రెండేళ్ల తర్వాత ఆయకట్టులో సాగు.. ఆనందంలో రైతులు..!

రెండేళ్ల తర్వాత ఆయకట్టులో సాగు.. ఆనందంలో రైతులు..!

మన సాక్షి, నల్లగొండ బ్యూరో :

నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులు ఆనందంలో మునిగిపోతున్నారు. రెండేళ్ల తర్వాత ఆయకట్టుకు సాగునీరు అందడంతో రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరి నారు పోసుకొని సిద్ధం చేసుకున్న రైతులు నీటి విడుదలతో నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు.

గత ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా నాగార్జునసాగర్ జలాశయం అడుగంటి పోయింది. దాంతో సాగునీటికే కాకుండా తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. అందువల్ల నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో గత ఏడాది క్రాఫ్ హాలిడే ప్రకటించారు.

పంట పొలాలన్నీ బీళ్లుగా మారాయి. ఈ ఏడాది ముందస్తుగానే వర్షాలు సమృద్ధిగా కురవడంతో భిరభిరా కృష్ణమ్మ సాగర్ వైపు కదిలి వచ్చింది. దాంతో సాగర్ ఎడమ కాలువకు ఆగస్టు 2వ తేదీన తెలంగాణ ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. దాంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు.

ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సాగు :

నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాలు కూడా ఉన్నాయి. ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో 3.40 లక్షల ఎకరాలు సాగులోకి రానున్నది. దాంతో పాటు మరో 80 వేల ఎకరాలు ఎత్తిపోతల పథకాల కింద సాగు చేయనున్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురియడంతో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరు అందే అవకాశం ఉంది. రైతులు సమృద్ధిగా వరి నాట్లు వేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి : 

Nagarjunasagar : నాగార్జునసాగర్ కు 4.19 లక్షల క్యూసెక్కుల వరద.. గేట్లు ఎత్తేందుకు అధికారులు ఆప్రమత్తం..!

Nagarjunasagar : సాగర్ ఆయకట్టు రైతులకు శుభవార్త.. ఎడమ కాలువకు నీటి విడుదల..!

Milk packets : మీరు ప్యాకెట్ పాలు తాగుతున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!

మరిన్ని వార్తలు