Miryalaguda : గ్రామాల్లో ప్రతిరోజు ఆకస్మిక తనిఖీలు.. వెంటనే సమస్యలకు పరిష్కారం, ఎమ్మెల్యే బిఎల్ఆర్..!
Miryalaguda : గ్రామాల్లో ప్రతిరోజు ఆకస్మిక తనిఖీలు.. వెంటనే సమస్యలకు పరిష్కారం, ఎమ్మెల్యే బిఎల్ఆర్..!
అడవిదేవులపల్లి, మన సాక్షి
మిర్యాలగూడ నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి మండలంలో ప్రతిరోజు ఒక గ్రామంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
శనివారం ఆయన నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి మండలంలో ప్రజా సమస్యలపై ప్రజా పాలనలో పాల్గొన్నారు. అడవిదేవులపల్లి మండలంలోని రైతు వేదిక నందు అధికారులతో కలసి ఇప్పటివరకు ప్రజా పాలనలో సేకరించిన దరఖాస్తుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి ప్రతీ రోజు మండలంలోని ఏదో ఒక గ్రామ పంచాయితీ కార్యాలయాలలో అకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, అధికారులు లేకపోతే తక్షణమే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
గ్రామాల్లో అధికారులు రైతులకు నిత్యం అందుబాటులో ఉండాలని అన్నారు. రైతుల సమస్యలు ఏది ఉన్నా తక్షణమే పరిష్కారం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రజలు తమ సమస్యలకు, పంచాయతీ కార్యాలయంలోనో లేక మండల కార్యాలయంలో పరిష్కారం జరగాలి గానీ వారు క్యాంప్ కార్యాలయం వరకు, జిల్లా కేంద్రం వరకు వెళ్ళే విధంగా వారిని ఇబ్బంది పెట్టకూడదు అని హెచ్చరించారు.
అనంతరం డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్కైలాబ్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్, మండల పార్టీ ప్రసిడెంట్ బాలు నాయక్ తో కలసి ప్రజలతో, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారి నుంచి ఫిర్యాదులు సేకరించారు.
అడవిదేవులపల్లి మండలాలలో అత్యధికంగా రైతులు భూమి పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని వారికి అందరికీ న్యాయం చేయాలని భూమాత పైలెట్ ప్రాజెక్టు ద్వారా సాగులో ఉన్న ప్రతీ రైతుకు పట్టాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
LATEST UPDATE :
-
Nagarjunasagar : 16 క్రస్ట్ గేట్ల ద్వారా కొనసాగుతున్న కృష్ణమ్మ పరవళ్లు..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై తుమ్మల కీలక వ్యాఖ్యలు.. ఈ సీజన్ కు లేనట్టేనా..?
-
Good News : మీకు ఐదు ఎకరాల లోపు ఉందా.. భారీ గుడ్ న్యూస్, కేంద్రం మరో కొత్త పథకం..!
-
District collector: మన ఇసుక – మన వాహనం ద్వారా ఇసుక రవాణా.. జిల్లా కలెక్టర్..!









