క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణమహబూబాబాద్ జిల్లా

Accident : ఘోర ప్రమాదం.. రెండు లారీలు ఢీకొని ముగ్గురు సజీవ దహనం..!

Accident : ఘోర ప్రమాదం.. రెండు లారీలు ఢీకొని ముగ్గురు సజీవ దహనం..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ఖమ్మం – వరంగల్ జాతీయ రహదారిపై మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు లారీలు ఢీకొని క్యాబిన్ లో మంటలు చెలరేగడంతో ముగ్గురు సజీవ దహనమయ్యారు. వివరాల ప్రకారం..

విజయవాడ నుండి పౌల్ట్రీ మెటీరియల్ లోడుతో గుజరాత్ కు వెళ్తున్న ఒక లారీ.. అదేవిధంగా గ్రానైట్ లోడ్ వరంగల్ నుండి ఖమ్మం వైపు వెళ్తున్న మరో లారి శుక్రవారం తెల్లవారుజామున ఢీకొన్నాయి .
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజి వద్ద ఈ ప్రమాదం సంభవించింది.

రెండు లారీలు ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొన్నాయి. దాంతో లారీ క్యాబిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ముగ్గురు అందులోనే సజీవ దహనమయ్యారు. మరొకరు పరిస్థితి విషమంగా ఉంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. మృతులను క్యాబిన్ నుంచి బయటికి తీసి మార్చురీకి పంపారు. హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు దగ్గరుండి క్లియర్ చేశారు.

MOST READ : 

  1. Nagarjuna Sagar : నాగార్జునసాగర్ కు చేరుతున్న వరద నీరు.. ఈసారి కూడా ముందస్తేనా..!

  2. Miryalaguda : వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఇద్దరు విటులు, ఆరుగురు మహిళలు అరెస్ట్..!

  3. District Collector : రాత్రి వేళ గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!

  4. Nalgonda : రైస్ మిల్లర్లకు వారం రోజులు గడువు.. అదనపు కలెక్టర్ ఆదేశాలు.!

  5. Murder : తండ్రిని హత్య చేసిన కొడుకు.. ఎందుకంటే..!

మరిన్ని వార్తలు