సూర్యాపేట : వైద్యుల నిర్లక్ష్యం.. శిశువు మృతి..!

సూర్యాపేట ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..

సూర్యాపేట : వైద్యుల నిర్లక్ష్యం.. శిశువు మృతి..!

సూర్యాపేట, మనసాక్షి

సూర్యాపేట ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..

పెన్ పహాడ్ మండలం గాజుల మల్కాపురం గ్రామానికి చెందిన వనపట్ల మానస ను, బుధవారం సాయంత్రం డెలివరీ కోసం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి కుటుంబ సభ్యులు తీసుకురాగా, డ్యూటీ డాక్టర్ చూసి డెలివరీకి ఇంకా టైం ఉంది అంటూ పదే పదే చెప్తూ నిర్లక్ష్యం వహించారని, నా బిడ్డ నొప్పులకు తట్టుకోలేక పోతుంది.

ALSO READ : BIG BREAKING : పొంగులేటి నివాసంలో ఐటి, ఈడి సోదాలు..! ఖమ్మం , మన సాక్షి :

డెలివరీ చేయండి అంటూ డాక్టర్ కాళ్ళ మీద పడి ప్రాధేయపడిన కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గురువారం తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో శిశువు మంచిగానే ఉంది అంటూ చెప్పిన వైద్యులు..ఆ తర్వాత శిశువు మృతి చెందిందని తెలిపారని అన్నారు.

ఉదయం మృతి చెందిన శిశువును ఇప్పటివరకు మాకు చూపించలేదని, మా చేతికి ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.డ్యూటీ డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే మా బిడ్డ మృతి చెందిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్, సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

ALSO READ : Telangana Elections : తెలంగాణ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి.. ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్..!