Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : చేపలు పడుతుండగా కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి..!
చేపలు పడుతుండగా కరెంటు షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన మిర్యాలగూడ మండలంలోని వెంకటాద్రిపాలెం గ్రామంలో బుధవారం జరిగింది.

Miryalaguda : చేపలు పడుతుండగా కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
చేపలు పడుతుండగా కరెంటు షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన మిర్యాలగూడ మండలంలోని వెంకటాద్రిపాలెం గ్రామంలో బుధవారం జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన బుట్టి నాగయ్య (40) వజీరాబాద్ మేజర్ కాలువలో చేపలు పట్టడం కోసం వెళ్ళాడు.
కాల్వ పక్కనే ఉన్న సుగుణమ్మ ఇంటిలోని కరెంటు బోర్డు లో వైరు పెట్టి చేపలు పట్టడం కోసం కాలువలోకి దిగాడు. కాగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. అతని భార్య బుట్టి కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.









