క్రైంBreaking Newsతెలంగాణహైదరాబాద్

ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కమిషనర్.. మీడియా పేరుతో వసూళ్లు..!

ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కమిషనర్.. మీడియా పేరుతో వసూళ్లు..!

మన సాక్షి , రాజేంద్రనగర్ :

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజేంద్రనగర్ డివిజన్ లో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కారు. ఎసిబి డిఎస్పి శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

రాజేంద్రనగర్ సర్కిల్ లో ఓ హోటల్లో ఎలాంటి నిబంధనలు లేకపోవడం వల్ల సీజ్ చేస్తామని హోటల్ యజమానిని డిప్యూటీ కమిషనర్ రవికుమార్ బెదిరించాడు. తన హోటల్ సీజ్ చేయకుండా ఉండాలంటే ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాగా హోటల్ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందుగా మాట్లాడుకున్న పథకం ప్రకారం రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఏసీబీకి చిక్కాడు.

మీడియా పేరుతో అధిక వసూలు

హోటల్ యజమానిని డిప్యూటీ కమిషనర్ రవికుమార్ లంచం డిమాండ్ చేసిన సమయంలో మీడియా వారికి డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసినట్లు ఎసిబి డిఎస్పి వెల్లడించారు. మీడియాను అడ్డం పెట్టుకుని వసూలుకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

అయితే దీనిలో మీడియా ప్రతినిధులు పాత్ర వహించారా అనే విషయంపై ఆరాతీస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రవికుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించిన అనంతరం అతని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఆయన పేర్కొన్నారు.

MOST READ : 

  1. PMSBY : ఏడాదికి రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తింపు.. మీరు అర్హులేనా..!

  2. ACB : ఐదు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్..!

  3. Good News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ప్రతి రైతు ఖాతాలో రూ.2వేలు.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Gold Price : భారీగా రూ.13,600 తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ధర ఎంతంటే..!

  5. Gold Price : వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు