Breaking Newsతెలంగాణనల్గొండవైద్యం

DEVARAKONDA : దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ..! 

DEVARAKONDA : దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ..! 

దేవరకొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ దవాఖానాలో ప్రవాసాల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్ రావు తెలిపారు. శనివారం దేవరకొండ ఏరియ ఆసుపత్రికి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ల్యాబ్,ఓపి, జనరల్, గైనిక్ వార్డులను, ఇన్ పేషెంట్, ఔట్ పేషంట్, వార్డ్లను పరిశీలించారు. ప్రతిరోజు ఎన్ని కాన్పులు చేస్తున్నారు అదనపు కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. వైద్యులు , మరియు సిబ్బంది రిజిస్టర్ ను అడిగి తెలుసుకున్నారు.

ఓపీలో ఎంతమంది వచ్చారు?, ఇప్పటిదాకా ఈ నెలలో ఎన్ని ప్రవాసాలు జరిగాయి? మత్తు డాక్టర్ విషయాలని అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ ఆవరణలో స్వచ్ఛత,పరిశుభ్రత పాటించాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా పై ప్రత్యేక దృష్టి పెట్టి, టెస్టులు నిర్వహించి మందులు అందించాలని సూచించారు.

24 గంటలు అనస్తేషియా ఉండేటట్లు చర్యలు తీసుకుంటానని అన్నారు. వైద్య సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఉండాలని అన్నారు.

ఆస్పత్రిలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీధితోపాటు ఇంచార్జ్ సూపరిడెంట్ మంగ్త నాయక్, డాక్టర్ రంజిత్, డాక్టర్ శశికళ, మున్సిపల్ ఏఈ రాజు , ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

కీచక టీచర్.. సస్పెన్షన్ వేటు..!

మిర్యాలగూడ : పిడిఎస్ బియ్యం రీసైక్లింగ్.. ట్రేడింగ్ లైసెన్సులతో భారీ మోసం..!

Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!

Runamafi : రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్.. ఇలా చేస్తే చాలు..!

మరిన్ని వార్తలు