Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

మిర్యాలగూడ : పిడిఎస్ బియ్యం రీసైక్లింగ్.. ట్రేడింగ్ లైసెన్సులతో భారీ మోసం..!

మిర్యాలగూడ : పిడిఎస్ బియ్యం రీసైక్లింగ్.. ట్రేడింగ్ లైసెన్సులతో భారీ మోసం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

పిడిఎస్ బియ్యం రీసైక్లింగ్ చేస్తూ భారీ మోసానికి పాల్పడుతున్న సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. భారీ మోసాలకు పాల్పడుతున్న 9 మంది ముఠాను మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.

శుక్రవారం మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. మిర్యాలగూడ మండలం జంకు తండాలోని శ్రీ లక్ష్మీ మినీ ప్యాడి రైస్ మిల్ వద్ద రెండు వాహనాలలో పిడిఎస్ బియ్యం ఉన్నాయని సమాచారం మేరకు అక్కడికి వెళ్లి విచారించి బియ్యం పట్టుకున్నట్లు తెలిపారు. రెండు వాహనాలలో 391 బస్తాలలో ఉన్న 200 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం సీజ్ చేసి విచారణ చేసినట్లు తెలిపారు.

మిల్లు యజమాని అయిన ధనావత్ నరేందర్ చిన్నచిన్న పిడిఎస్ అక్రమ వ్యాపారం చేసే వారి వద్ద నుంచి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేస్తాడు. ఆ బియ్యంను తన మిల్లులో పాలిష్ పట్టి నూకల గా మార్చి కొంతమంది వ్యాపారుల ట్రేడింగ్ పేపర్లను ఉపయోగించి హైదరాబాద్ లో విక్రయిస్తాడు. హైదరాబాదులోని తను ఒప్పందం చేసుకున్న కంపెనీలకు విక్రయించగా వారు బేవరేజ్ కంపెనీలకు పంపిస్తారని విచారణలో తేలింది.

ధనావత్ నరేందర్ అనే వ్యక్తి రమావత్ శ్రీను, ధీరావత్ సోనీ, ఊట్ల వెంకటేశ్వరరావు, పసుమర్తి నాగేశ్వరరావు, బీర్ల వెంకట్ రెడ్డి వద్ద నుంచి ఈ పిడిఎఫ్ ను కొనుగోలు చేశాడు. అదేవిధంగా ట్రేడింగ్ కంపెనీల లైసెన్సులు కలిగిన పోతుగంటి శ్రీనివాస్, పాంపాటి శ్రీనివాస్, కొమ్మన పట్టాభిరామయ్య అనే వ్యక్తుల వద్ద నుండి వారు ట్రేడింగ్ పేపర్లను తీసుకొని నూకలుగా మార్చిన పిడిఎఫ్ బియ్యాన్ని హైదరాబాద్ కు భారీ ఎత్తున తరలిస్తున్నాడు. కాగా 9 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు డి.ఎస్.పి పేర్కొన్నాడు.

మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు, ఎస్ఐ నరేష్, హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు, కానిస్టేబుల్స్ దశ్రు, శ్రీనివాస్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి, నాగయ్య, సైదయ్య , మహేష్ , సైదా నాయక్, వెంకటేశ్వర్లు, హోంగార్డు మురళి కలిసి నేరస్తులను పట్టుకున్నట్లు డిఎస్పి తెలిపారు.

LATEST UPDATE : 

Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!

BIG BREAKING : నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే మహిళ ప్రసవం..!

Revanth, Batti : పిసిసి చీఫ్ అతడే.. ఇక మంత్రులు కూడా ఖరారు.. ఢిల్లీకి చేరిన రేవంత్, భట్టి..!

Runamafi : రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్.. ఇలా చేస్తే చాలు..!

మరిన్ని వార్తలు