Penpahad : యూరియా కోసం రహదారిపై మహిళా రైతుల ధర్నా..!

Penpahad : యూరియా కోసం రహదారిపై మహిళా రైతుల ధర్నా..!
పెన్ పహాడ్, మన సాక్షి :
యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు రహదారిపై మహిళా రైతులు భారీ ధర్నా రైతుల కు యూరియా కష్టాలు తీరడం లేదు సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం లో పిఎసిఎస్ కార్యాలయాల ముందు యూరియా కోసం రైతులు ఎగబడుతున్నారు. సోమవారం మండల కేంద్రంలోని చీదెళ్ల సహకార సంఘం కార్యాలయం ముందు జాతీయ రహదారిపై మహిళా రైతులు రైతు సోదరులు భారీగా రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పెన్ పహాడ్ ఎస్సై కస్తాల గోపికృష్ణ తన సిబ్బందితో ధర్నా వద్దకు చేరుకొని రైతులకు సమాధానం చెప్పుతుండగా అసలు మండల వ్యవసాయ అధికారి ఎక్కడ ఉన్నారు? రైతులకు ఎందుకు సమాధానం చెప్పడం లేదని రైతులు ప్రశ్నించడంతో బానోత్ అనిల్ కుమార్ ఏవో అక్కడకు విచ్చేసి యూరియా కొరత ఉన్నందున రైతులకు అందించలేకపోతున్నామని యూరియా వచ్చిన వెంటనే సీరియల్ ప్రకారం రైతులకు అందిస్తామని ఆయన సమాధానం చెప్పారు.
రైతులు ఎస్సై కస్తాల గోపికృష్ణ, మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ ను చుట్టు ముట్టడించడంతో వారి అందరికీ సూక్ష్మంగా సమాధానం చెప్పారు. రైతులు మాట్లాడుతూ రైతులు పిఎసిఎస్ కేంద్రాల వద్దకు తెల్లవారుజామునే వచ్చి లైన్లో నిలబడ్డాము కొందరు లైన్లో నిలబడలేక పాసుబుక్కులు, ఆధార్ కార్డులు లైన్లో పెట్టి తమ వంతు వచ్చేదాకా నీరసించినా చివరికి కొందరికి ఒక బస్తా యూరియా లభిస్తుందని, మరికొందరికి అది కూడా దొరకకపోవడంతో నిరాశతో వెనుతిరిగి పోతున్నామని ప్రభుత్వానికి మా కష్టాలను తెలియపరిచి తమకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని వేడుకుంటున్నారు.
పొలానికి సరి అయిన సమయంలో యూరియా వేయకపోవడంతో నాటు పెట్టిన వరి పొలం తెల్లవారి వరి గంటగా ఏర్పడకపోవడంతో పాటు పిలకలు కూడా రావడం లేదని రైతులు వాపోయారు. అధికారులు ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా మండలంలో యూరియా కోసం రైతు సోదరులు పడుతున్న ఇబ్బందులను గ్రహించి యూరియా దిగుమతి చేయించి రైతు సోదరులను ఆదుకోవాలని మండలంలో వివిధ గ్రామాల రైతులు అధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకుంటున్నారు.
MOST READ :
-
District collector : నిరుద్యోగులకు జిల్లా కలెక్టర్ శుభవార్త.. 19న జాబ్ మేళా..!
-
Alumni : 34 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక..!
-
Dost : దోస్త్ ద్వారా రేపు డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు..!
-
Big Twist : పట్టపగలు దారిదోపిడిలో బిగ్ ట్విస్ట్.. ఏడుగురి అరెస్ట్..!
-
Nalgonda : మహిళలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభవార్త.. ఆయా రంగాల్లో వారికే ప్రాధాన్యత..!










