Suryapet : సూర్యాపేటలో క్రీడా ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!
గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడకారుల యొక్క ప్రతిభను వెలికితీసి పల్లె నుండి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ 2025 క్రీడా పోటీలను నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.

Suryapet : సూర్యాపేటలో క్రీడా ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!
సూర్యాపేట, మనసాక్షి :
గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడకారుల యొక్క ప్రతిభను వెలికితీసి పల్లె నుండి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ 2025 క్రీడా పోటీలను నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.
సూర్యాపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా యువజన సర్వీస్ లు, క్రీడా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ ర్యాలీకి జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హాజరై క్రీడ టార్చ్ వెలిగించి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి సంతోష్ బాబు చౌరస్తా మీదుగా సద్దల చెరువు వరకు కొనసాగింది.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ పోటీల ప్రధాన ఉద్దేశ్యం గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడాకారులకు అవకాశాలు కల్పించడమమేనని తెలిపారు.
సి ఎం కప్ –2025 పోటీలు 44 క్రీడలలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరిలలో నిర్వహించడం జరుగుతుందని గ్రామ స్థాయి లో జనవరి 17 నుండి 22 వరకు, మండల స్థాయి లో జనవరి 28 నుండి 31 వరకు, నియోజకవర్గ స్థాయి లో పిబ్రవరి 3 నుండి 7 వరకు,
జిల్లా స్థాయి లో పిబ్రవరి 10 నుండి 14 వరకు అలాగే రాష్ట్ర స్థాయిల్లో పిబ్రవరి 19 నుండి 26 వరకు నిర్వహించబడతాయని సీఎం కప్ క్రీడా పోటీలపై జిల్లా యువజన సర్వీసులు, క్రీడలు, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ గ్రామాలలో యువతకు అవగాహన కల్పించి అత్యధికంగా పాల్గొని క్రీడాకారులు వారి యొక్క ప్రతిభను మెరుగుపరుచుకోవాలని సూచించారు.
అర్హత కలిగిన యువత సి ఎం కప్ –2025 పోటీల్లో పాల్గొనేందుకు. stag.telangana.gov..in పోర్టల్ లేదా గూగుల్ లో సి ఎం కప్ అని నమోదు చేయటం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.అధిక సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోని అవార్డు లు పొందాలని, ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
ఎస్ పి కే.నరసింహ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత క్రీడల యొక్క ప్రతిభను రాష్ట్ర, జాతీయ, ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు. ఆటలు ఆడటం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢత్వం పొందవచ్చని అన్నారు.
యువత చదువుతోపాటు ఆటలు, పాటలు, సంస్కృతిక కార్యక్రమాలలో లాంటి ఆసక్తి ఉన్న రంగాలలో రాణించాలని తల్లిదండ్రులు కుడా పిల్లలను వారికి ఆసక్తి ఉన్న రంగాలలో ప్రోత్సహించాలని సూచించారు. సీఎం కప్ క్రీడా పోటీలలో యువత పాల్గొని బహుమతులు పొంది సూర్యాపేట జిల్లాకు మంచి పేరు తీసుకొని రావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డి వై ఎస్ ఓ వెంకటరెడ్డి, డి.ఎస్.పి ప్రసన్నకుమార్, డిఎల్పిఓ నారాయణరెడ్డి, తహసిల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో బాలకృష్ణ, ఎం ఈ ఓ శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
MOST READ
-
Nalgonda : ఆసుపత్రి నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక ఆదేశం..!
-
TG News : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుక..!
-
Nalgonda : మధ్యప్రదేశ్ లోని థార్ జిల్లాను జల్లడ పట్టిన నల్గొండ సిసిఎస్ పోలీసులు.. ఎందుకో తెలిస్తే షాక్..!
-
TG News : కొత్త వాహనాలు కొనేవారికి శుభవార్త.. ఇక ఆర్టిఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు..!










