Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District collector : జిల్లా కలెక్టర్ సీరియస్.. తాగునీటి విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు..!

District collector : జిల్లా కలెక్టర్ సీరియస్.. తాగునీటి విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు..!

నల్గొండ , మన సాక్షి :

వేసవిలో తాగునీటికి ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె చండూరు మునిసిపల్ కార్యాలయంలో చండూరు మున్సిపాలిటీ , చండూరు గ్రామీణ ప్రాంతంలో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు.

చండూరు మున్సిపాలిటీ తో పాటు, గ్రామపంచాయతీలలో జనాభా ఆధారంగా తాగునీటిని ఇవ్వాలని ,ఎక్కడైనా మిషన్ భగీరథ తాగునీటి వనరులు, బోర్లు చెడిపోయిన, మైనర్ రిపేర్లు ఉన్నట్లయితే గుర్తించి వాటి మరమ్మతులకు కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని, అలాగే పైపు లైన్ లీకేజీలను అరికట్టి తాగునీర్వాల్సిందిగా ఆదేశించారు.

మిషన్ భగీరథ త్రాగునీటిని కేవలం తాగేందుకు మాత్రమే వినియోగించుకోవాలని, పశువులు, ఇండ్లు, కార్లు వంటి వాటిని శుభ్రం చేసుకునేందుకు, ఇతర అవసరాలకు మిషన్ భగీరథ తాగునీటిని వాడవద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. తాగునీటి విషయంలో అధికారులు, సిబ్బంది ఆలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

ఈ వేసవిలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులకు గురి కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.అనంతరం మున్సిపల్ పరిధిలో 9వ వార్డులో ఉన్న జిఎస్ఎల్ ఆర్ ను పరిశీలించారు. అలాగే ఏడవ వార్డులో నిర్మాణంలో ఉన్న ఓహెచ్ఎస్ఆర్ ను తనిఖీ చేశారు.

అధనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, చండూరు ఆర్డీవో శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ మునావర్ అలీ, పబ్లిక్ హెల్త్ డి ఈ మనోహర ,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పూజిత, పంచాయతీరాజ్ ఈ ఈ , ఎంపీడీవో రామిరెడ్డి తదితరులు ఉన్నారు.

LATEST NEWS : 

  1. TG News : రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం.. రూ.2 లక్షల రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!

  3. Fraud : నల్గొండ జిల్లాలో భారీ మోసం.. ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. 26 లక్షలతో పరార్..!

  4. Nalgonda : నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం.. వాగులో పడి అన్నదమ్ములు మృతి..!

  5. Rythu : కౌలు రైతుకు భారీ గుడ్ న్యూస్.. ఏడాదికి రూ 20,000..!

  6. Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు