District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ..!
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. అన్ని తరగతి గదులను పరిశీలించారు. ఏడవ తరగతిలో మ్యాథ్స్ పాఠం వింటున్న విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు.
ఈ సబ్జెక్టును పిల్లలకు బోధించారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో మెళకువలతో విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయురాలికి సూచించారు. పాఠశాలలోని అన్ని గదులను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రం చిన్న గదిలో నిర్వహిస్తుండడంతో పాఠశాలలో ఖాళీగా ఉన్న విశాలమైన గదికి తక్షణమే మార్చాలని ఆదేశించారు. విద్యార్థులు తప్పనిసరిగా యూనిఫామ్, షూ ధరించేలా చూడాలని, క్రమశిక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ రాజేశ్వరి, ఎంపీడీవో రాజేశ్వరి ఉన్నారు.
MOST READ :
-
Rusk : రస్క్‌లు తింటున్నారా.. ఏమవుతుందో తెలుసుకుందాం..!
-
Peanuts : వేరుశెనగలు ఎన్ని తినాలి.. ఎక్కువ తింటే గుండెకు ప్రమాదమా..!
-
District collector : జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ కీలక ఆదేశాలు.. ఆ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి..!
-
Bandi Sanjay : ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్ కు దోచిపెడతారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!
-
High Court : కాళేశ్వరం పై సిబిఐ విచారణకు బ్రేక్.. కెసిఆర్ కు భారీ ఊరట..!
-
TG News : తెలంగాణలో రైతులకు భారీ శుభవార్త..!









