తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపికకు గడువు విధింపు..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపికకు గడువు విధింపు..!

సూర్యాపేట, మనసాక్షి :

రాజీవ్ యువ వికాస పధకం ద్వారా అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈనెల 25 కల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, మండల అభివృద్ధి అధికారులతో రాజీవ్ యువ వికాసం పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ మాట్లాడుతూ పరిశీలించి పూర్తి చేయాలని కేటగిరి వైజ్ గా రిజర్వేషన్ నిష్పత్తిని అనుసరించి జూన్ 25 వరకు మండల స్థాయి కమిటీలతో ఎంపిక పూర్తి చేసి జిల్లా స్థాయికి లబ్ధిదారుల జాబితాను అందజేయాలని కలెక్టర్ తెలిపారు. బ్యాంకు లింకేజీ ఉన్న దరఖాస్తులు అర్హులైన జాబితాను కూడా పూర్తిచేసి జూన్- 2 నాటికి లబ్ధిదారుల కు మంజూరు ఉత్తర్వులు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ఇందుగాను పూర్తి స్థాయిలో అధికారులు ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు.

ఈ కార్యక్రమంలో ఇడి ఎస్ సి కార్పొరేషన్ శ్రీనివాస్ నాయక్, పశుసంవర్ధక అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, ఎల్డీఎం బాపూజీ, డిప్యూటీ సీఈఓ శిరీష, మెప్మా పీడీ రేణుక, మత్స్యశాఖ అధికారి నాగయ్య, డి డబ్ల్యు ఓ నరసింహారావు, డిటిడిఓ శంకర్,dmwo జగదీష్ రెడ్డి,యస్సి అబివ్రద్ది అధికారి దయానందరాణి, సర్వే అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎంవిఐ ఏ ఆదిత్య, ఆడిట్అధికారి శ్యామ్ సుందర్ ప్రసాద్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : ఇవీ కేంద్ర ప్రభుత్వ పథకాలు.. దరఖాస్తు ఇలా.. సద్వినియోగం చేసుకోవాలి.. జిల్లా కలెక్టర్..!

  2. Ration Cards : రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా.. వచ్చిందా..? రాలేదా.? తెలుసుకోవడం చాలా సింపుల్.. ఇలా చేయండి..!

  3. Yugantham : వామ్మో యుగాంతం.. కౌంట్ డౌన్ స్టార్ట్.. ఎప్పుడో తెలిస్తే షాక్..!

  4. Hydra : పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు..!

  5. Rythu Bharosa : రైతుల ఖాతాలలో డబ్బులు.. రైతు భరోసా ఈసారి వారికి కూడా.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు