Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలి..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలి..!

కనగల్, మనసాక్షి:

ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ఐకెపి, పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు పారదర్శకంగా నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం దోరెపల్లిలో ఏర్పాటు చేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. నిర్ణీత తేమశాతం ప్రకారం ధాన్యం కాంట వేయాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలను లోతట్టు ప్రాంతాల్లో ఏర్పాటు చేయొద్దని సూచించారు.

వర్షాకాలం కావడంతో అకాల వారాలు రానున్న నేపథ్యంలో ధాన్యంపై కప్పేందుకు రైతులు టార్పాలిoడ్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వం కల్పించే మద్దతు ధరను పొందాలన్నారు.

అనంతరం అధికారులు శాబ్దుల్లాపురం, రేగట్టే, పొనుగోడు, రామచంద్రపురం, మదరపురం, బోయినపల్లి, బుడుమర్లపల్లి, తుర్కపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు.

ఆయా కార్యక్రమాలలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, ఎంపీడీవో సుమలత, ఐకేపీ ఏపీఎం మైశేశ్వరరావు, సీసీలు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Nalgonda : మద్యం వ్యాపారులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బిగ్ షాక్.. టెండర్లు వేసేవారికి సూచనలు..!

  2. ఎంత కష్టం వచ్చిందో ఏమో.. కుటుంబం మొత్తం రైలు కిందపడి ఆత్మహత్య..!

  3. TG News : తెలంగాణ రాజకీయాల్లో మరో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..!

  4. District collector : విధుల పట్ల నిర్లక్ష్యం.. జిల్లా కలెక్టర్ సీరియస్, ప్రిన్సిపాల్ కు షోకాజ్..!

మరిన్ని వార్తలు