District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. 12 మంది పంచాయతీ కార్యదర్శులపై చర్యలు..!

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. 12 మంది పంచాయతీ కార్యదర్శులపై చర్యలు..!
నల్గొండ, మన సాక్షి :
నల్గొండ జిల్లాలో జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 12 మంది పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు. జనరల్ ఫండ్ ఆగం చేశారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం విడిచిపెట్టి రాజకీయాలు చేస్తున్నారని వారిపై ఫైర్ అయ్యారు. ఇంటి పన్నులు వసూలు చేసి చలాన్ కట్టకుండా కార్యదర్శులు లక్షల్లో నిధులు దుర్వినియోగం చేశాని వారిపై చర్యలు తీసుకున్నారు.
నల్గొండ జిల్లా లో పలువురు పంచాయతీ కార్యదర్శులు ఇంటి పన్ను, ఫంక్షన్ హాల్స్, పెట్రోల్ పంపులు, వ్యాపార సంస్థలు, కళ్యాణ లక్ష్మి, హౌస్ రిజిస్ట్రేషన్, వెంచర్లపై ప్రభుత్వానికి రావలసిన చలాన్లను చెల్లించకుండా అక్రమాలకు పాల్పడ్డట్లు సమాచారం. కొంతమంది పంచాయతీ కార్యదర్శులు డబల్ రషీదుల పుస్తకాలతో అక్రమాలకు పాల్పడినట్లు జిల్లా కలెక్టర్ విచారణలో తేలినట్లు తెలిసింది.
మండల పంచాయతీగా అధికారులు సరైన మానిటరింగ్ చేయకపోవడం వలన ఆన్ లైన్ లో తక్కువ చూపించి ఎక్కువ వసూలు చేసి అధికారులను తప్పుదోవ పట్టించినట్లు తేలింది. దాంతో పాటు ఇసుక గ్రామపంచాయతీలలో అక్రమాలు ఎక్కువ జరిగినట్లు సమాచారం మేరకు పంచాయతీ కార్యదర్శుల పై చర్యలు చేపట్టిస్తున్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా పై ప్రభుత్వం క్లారిటీ.. తక్కువ వచ్చిందా.. అసలు రాలేదా.. ఇలా చేయండి..!
-
Gold Price : తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం ధరలు.. 22K తగ్గింది.. 24K పెరిగింది..!
-
District collector : కల్తీ ఆహార పదార్థాలతో ప్రజలకు అనారోగ్యం.. అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు..!
-
Hyderabad : రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్లపై నల్గొండ జిల్లా రైతు ధర్నా..!









