Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
Hyderabad : రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్లపై నల్గొండ జిల్లా రైతు ధర్నా..!
Hyderabad : రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్లపై నల్గొండ జిల్లా రైతు ధర్నా..!
హైదరాబాద్, మన సాక్షి :
రుణమాఫీ కాలేదని గాంధీ భవన్ మెట్లపై ఓ రైతు శుక్రవారం ధర్నా చేశారు. వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన అంబారిపేట గ్రామ రైతు తోట యాదగిరి ధర్నా చేశారు. తాను నిరుపేద కుటుంబానికి చెందిన రైతునని తన భూమిపై క్రాఫ్ లోన్ తీసుకోగా మాఫీ కాలేదని పేర్కొన్నాడు.
ఇప్పుడు ఆ రుణం వడ్డీతో సహా మూడు లక్షలకు పైగా పెరిగిందని, తనకు రుణమాఫీ కాలేదని పేర్కొన్నాడు. జిల్లా కలెక్టర్ ద్వారా తనకు మాఫీ అయ్యేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేలు పూర్తి చేయాలని మనవి చేస్తున్నట్లు పేర్కొన్నాడు. తనకు ఎలాంటి పింఛన్, ప్రభుత్వ సహాయం, వడ్ల బోనస్ కూడా రాలేదని యాదగిరి పేర్కొన్నాడు.
MOST READ :
-
Hyderabad : హైదరాబాద్ – మదీనా కు విమాన సేవలు..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై ప్రభుత్వం క్లారిటీ.. తక్కువ వచ్చిందా.. అసలు రాలేదా.. ఇలా చేయండి..!
-
Gold Price : తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం ధరలు.. 22K తగ్గింది.. 24K పెరిగింది..!
-
Phone : మార్కెట్లోకి మడతలు పెట్టే (Tri Folded) ఫోన్.. 2 in 1 వినియోగం..!









