తెలంగాణBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలు

District collector : అక్రమ కట్టడాలపై జిల్లా కలెక్టర్ సీరియస్.. నోటీసులు జారీ చేయాలని ఆదేశం..!

District collector : అక్రమ కట్టడాలపై జిల్లా కలెక్టర్ సీరియస్.. నోటీసులు జారీ చేయాలని ఆదేశం..!

జగిత్యాల, (మన సాక్షి)

జగిత్యాల అర్బన్ మున్సిపాలిటీ పరిధిలో డ్రైవ్ క్లీనింగ్ శానిటేషన్ లో భాగంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ విస్తృతంగా సందర్శించారు. గురువారం జగిత్యాల అర్బన్ లో ఎల్ ఎల్ గార్డెన్ వెనకాల 27వ వార్డు నాలా సమస్యల గురించి పరిశీలించారు. ఇల్లీగల్ అక్రమ కట్టడాలు ఉన్నట్లయితే కోర్టు ద్వారా నోటీసులు జారీ చేయాలని నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు.

ధరూర్ క్యాంప్ రామాలయం దగ్గర మేజర్ జంక్షన్ నాలా లు ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయాలని ధరూర్ కెనాల్ దగ్గర రోడ్ ప్రమోషన్ అయిన దానిని పరిశీలించాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. చింతకుంట చెరువు వాటర్ బయటకు వెళ్ళుట కొరకు నాలా లు, రాజు చౌరస్తా కూడలిలో డ్రైనేజీ లలో చెట్లు ముళ్ళ పొదలు,వేస్టేజ్ ఎప్పటికప్పుడు క్లీనింగ్ గా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు.

జగిత్యాల మునిసిపాలిటీలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద నగరంలో వ్యర్థ నివారణ, డ్రెయిన్‌లు, వాగులు, ప్రభుత్వ భూముల శుభ్రపరిచే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

రామాలయం పక్కన ఉన్న ప్రభుత్వభూములు (18వ వార్డు) పెద్ద నాలా ఎస్సారెస్పీ కాలువ వద్ద (1వ వార్డు), శంకులపల్లి (14వ వార్డు), సోడా సెంటర్ ప్రాంతాల్లో ప్రధానంగా డ్రెయిన్‌లు, వాగులు, కలుషిత ప్రాంతాలను శుభ్రపరచడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లాకలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమాలను డ్రైవ్ మోడ్‌లో తీసుకోవాలని, మునిసిపల్, నీటిపారుదల, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం కావాలని ఆదేశించారు. ప్రైవేట్ భూముల యజమానులు తమ భూముల్లోని ముల్ల చెట్ల పొదలు తొలగించకపోతే, జరిమానాలు విధించి, ఆ మొత్తం డబ్బుతో శుభ్రత పనులు చేపట్టాలని కలెక్టర్ గారు సూచించారు. ఈ పనుల్లో అధికారులు అత్యంత చురుకుగా పాల్గొనాలని, ప్రజలకు కనిపించేలా పర్యావరణ పరిశుభ్రత కనిపించాలన్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జగిత్యాల్ రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, జగిత్యాలమున్సిపల్ కమిషనర్ స్పందన, నీటిపారుదల శాఖ ఖాన్ జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్ మరియు.సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Suryapet : నీళ్ల కోసం రోడ్డెక్కిన స్టూడెంట్స్ ఘటన.. ప్రిన్సిపాల్ సస్పెండ్..!

  2. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. అలాంటి వారి జీతాన్ని నిలిపివేస్తా..!

  3. Obesity: అన్నం తింటే బరువు పెరుగుతారా.. నిజమిదే తెలుసుకుందాం..!

  4. District Collector : విద్యార్థుల ఇంటికి వెళ్లిన జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలుసా..!

  5. Mother : విదేశాలకు వెళ్లి బాగా డబ్బు సంపాదించారు.. తల్లిని మాత్రం ఇంట్లో నుంచి గెంటివేశారు..!

మరిన్ని వార్తలు