Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda : జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసిన ఎంపీడీవో, గ్రామ కార్యదర్శులను విధుల్లోకి తీసుకోవాలి.. లేదంటే ముమ్మడి సెలవులంటూ హెచ్చరిక..!
Nalgonda : జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసిన ఎంపీడీవో, గ్రామ కార్యదర్శులను విధుల్లోకి తీసుకోవాలి.. లేదంటే ముమ్మడి సెలవులంటూ హెచ్చరిక..!
శాలిగౌరారం, మనసాక్షి
నల్లగొండ జిల్లాలో జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసిన గుర్రంపోడ్ ఎంపీడీఓ ను, ఇద్దరు పంచాయితీ కార్యదర్శులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేకపోతే తాము సామూహిక సెలవులు పెడుతామని శాలిగౌరారం మండల పంచాయితీ కార్యదర్శులు శాలిగౌరారం ఎంపీవో పద్మ కు, సూపరిండెంట్ గాదరి సుందరయ్య కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయితీలకు నిధులు ఇవ్వకుండా ఆర్ధిక భారాన్ని మోపే విధులను కేటాయిస్తూ తమను మనోవేదన కు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం లోపంచాయతీ కార్యదర్శుల గౌరవ అధ్యక్షులు కె. ఎన్ చారి, అధ్యక్షులు చింత నరేందర్, ఉపాధ్యక్షులు జె. వెంకన్న, మహేశ్వరం విజయ్ కుమార్, పర్వతం కృష్ణ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
క్లిక్ చేసి ఈ వార్తలు కూడా చదవండి :
-
Cm Revanth Reddy : విద్యార్థులకు గుడ్ న్యూస్.. జాబ్ గ్యారంటీ కోర్సు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!
-
Cm Revanth : నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. 35వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్..!
-
Ration Cards : తెలంగాణ ప్రజలకు సర్కార్ బిగ్ షాక్.. వారి రేషన్ కార్డులన్నీ రద్దు..!
-
Hyderabad : హైదరాబాద్ నుంచి కొత్తగా 6 నగరాలకు నేరుగా విమానాలు..!









