తెలంగాణజిల్లా వార్తలుమెదక్

KGBV : కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్..! 

కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు వసతి గృహాలు క్లీనింగ్ యాక్టివిటీ, ఇంకా మెరుగైన వసతులు అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.

KGBV : కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్..! 

కొల్చారం, మన సాక్షి :

కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు వసతి గృహాలు క్లీనింగ్ యాక్టివిటీ, ఇంకా మెరుగైన వసతులు అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్
రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం కొల్చారం మండలం కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని సందర్శించి బాలికలకు అమలవుతున్న సౌకర్యాలు, విద్యా బోధన, పరిసాల పరిశుభ్రత, మెనూ, సంబంధిత వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులతో జిల్లాలో ఉన్న అన్ని కేజీబీవీల , సంక్షేమ పాఠశాలల్లో వసతి గృహాలు ప్రత్యేక పరిశీలనలు చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు ప్రస్తుతం ఉన్న వసతులు, ఇంకా మెరుగైన వసతులు, కల్పన సంక్రాంతి సెలవు దినాల్లో క్లీనింగ్ యాక్టివిటీ అమలు చేస్తున్నట్లు వివరించారు.

సంక్రాంతి సెలవు దినాల వారం రోజుల్లో మరలా వారు సెలవులు తర్వాత తిరిగి వచ్చేసరికి పరిశుభ్రత , ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తూ బాల,బాలికల చదువులకు ఎటువంటి అంతరాయం కలవకుండా వసతులు మెరుగుపరచడం లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు.పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ తరగతి గదుల దగ్గర నుంచి, స్టోర్ రూమ్ , కిచెన్ షెడ్ వరకు, క్లీనింగ్ చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

కే.జీ.బీ.వీలు , సంక్షేమ పాఠశాలలో వసతి గృహాలు పరిశుభ్రతలో భాగంగా బాలికలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యం జిల్లావ్యాప్తంగా అన్ని కేజీ బీవీలు లతోపాటు అన్ని సంక్షేమ వసతి
గృహాలలో క్లీనింగ్ యాక్టివిటీ అమలు ఉపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణ కల్పించి వారి విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంవిశేష కృషి చేస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, కొల్చారం తాసిల్దార్ శ్రీనివాసాచారి,సంబంధిత కస్తూరిబా గాంధీ విద్యాలయం ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ 

  1. Narayanpet : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి పత్రికలు.. మన సాక్షి క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ..!

  2. BIG BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు బీబీఏ విద్యార్థులు మృతి..!

  3. TG News : ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఇక వారి కష్టాలు తీరినట్టే..!

మరిన్ని వార్తలు