తెలంగాణBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలునల్గొండ

District collector : జిల్లా కలెక్టర్ వార్నింగ్.. రెండు రోజుల్లో బకాయిలు చెల్లించకుంటే సీజ్..!

District collector : జిల్లా కలెక్టర్ వార్నింగ్.. రెండు రోజుల్లో బకాయిలు చెల్లించకుంటే సీజ్..!

జగిత్యాల, (మన సాక్షి) :

జగిత్యాల జిల్లా కేంద్రంలో రాయికల్ , మెట్ పల్లి పట్టణాలలో జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఆదివారం విస్తృతంగా పర్యటించారు. జగిత్యాల, రాయికల్
మెట్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్నులు వసూలు, ఎల్ఆర్ఎస్ పనులను కలెక్టర్
పరిశీలించారు.

మెట్ పల్లి , జగిత్యాల పట్టణంలో అత్యధికంగా పన్ను బకాయిలు ఉన్న షాపింగ్ మాల్ లను సందర్శించి, రెండు రోజులలో బకాయిలు కట్టకుంటే సీజ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.

ఈనెల 31 వరకు ఉన్న గడువులో 100 శాతం ఇంటి పన్ను వసూలు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం
గడువు లోపల అందరూ ఇంటి పన్ను బకాయిలు చెల్లించాలి, లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.

పట్టణంలోని వార్డు అధికారులకు లక్ష్యాలను నిర్దేశించి ప్రతి ఒక్క ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుదారుడికి మరియు ఇంటి పన్ను బకాయిదారునికి ఫోన్ చేసి తప్పనిసరిగా మార్చి 31 లోపు ఫీజు చెల్లించేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

అత్యధిక బకాయిలు ఉన్న వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.బకాయిలు ఉన్న వారికి నోటీసులు జారీ చేయడం, ఇంకా చెల్లించని వారి ఆస్తులను పురపాలక సంఘ చట్టం – 2019 ప్రకారం సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించారు.

పట్టణ అభివృద్ధి ప్రజల సహకారంతోనే సాధ్యమని, అందరూ తమ ఆస్తి పన్నులను మరియు ఇతర మున్సిపల్ పన్నులను సకాలంలో చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. వంద శాతం పన్ను వసూలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్, బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులకు సూచించారు.కలెక్టర్ వెంట, మున్సిపల్ కమిషనర్లు, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Miryalaguda : మున్సిపాలిటీలో వారికి రెడ్ నోటీసులు జారీ.. షాపులు సీజ్..!

  2. TG News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రామ పాలన అధికారి పోస్టుల మంజూరుకు ఉత్తర్వులు జారీ..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వినియోగదారుల అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి వారికి సేవలు బంద్..!

  4. Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. స్నేహితురాలిని ఇంటికి పిలిపించిన యువతి.. అత్యాచారం, ఫోటోలు, వీడియోలతో బెదిరింపు..!

మరిన్ని వార్తలు