District collector : అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ప్రజలకు సూచన.. మొంథా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు..!

District collector : అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ప్రజలకు సూచన.. మొంథా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు..!
నల్లగొండ, మన సాక్షి :
మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామస్థాయి వరకు అధికారులు, సిబ్బంది అందరూ వారి వారి కార్య స్థానాల్లో ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం ఆమె మొంథా తుఫాన్ ప్రభావం పై జిల్లా, డివిజన్ స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు ఎవరు సాధ్యమైనంత వరకు ఇళ్లనుండి బయటకు రావద్దని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పారు.రైతులు పొలం పనుల నిమిత్తం పోలాలకు వెళ్ళవద్దని, అలాగే పంట కోతలు చేయవద్దని, పొలాలకు వెళ్లిన సమయంలో వాన నీటిలో పాముకాటు గురయ్యే అవకాశం ఉందని ,అలాగే పిడుగుపాటు,ఇతర ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు.
వీటన్నిటి నుండి సురక్షితంగా ఉండేందుకు ఇళ్లలో ఉండాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,వర్షం వల్ల తడిసి పడిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లల్లో ఎవరు ఉండకుండా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు అలాంటి ఇండ్లను గుర్తించి యజమానులకు నోటీసులు జారీ చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
వర్షాల నేపద్యంలో పాఠశాలలకు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించడం జరిగిందని, అయినప్పటికీ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు,, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉండే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కడగకుండా సంబంధిత ఆర్సివోలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా పాఠశాలల్లో పారిశుధ్య,ఆరోగ్య సమస్యలు, విద్యుత్ ప్రమాదాలు,ఇతర సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.రైతులు పశువులను పొలాల్లోకి వదల వద్దని, అలా వెళ్లడం వల్ల పిడుగుపాటుకు పశువులు చనిపోయే ఆస్కారం ఉందని తెలిపారు.
వర్షాలనేపద్యంలో ప్రజలుప్రత్యేకించి యువత వాగులు, వంకలు, నదుల వద్దకు ఈత కొట్టేందుకు, బట్టలు ఉతికేందుకు, చేపలు పట్టేందుకు ఎవరు వెళ్ళవద్దని, అలాగే లోతట్టు కాజ్ వేలు, పొంగి ప్రవహించే బ్రిడ్జిలు, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని ఆదేశించారు.వర్షాలను దృష్టిలో ఉంచుకొని దాన్యం, పత్తి కోతలు చేయవద్దని రైతులను కోరారు. అలాగే కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం ,పత్తి పంటలు తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఇందులో భాగంగా టార్పాలిన్లు కప్పి ఉంచాలని అన్నారు.
ఎక్కడైనా రహదారులు దెబ్బ తిన్న ,కోతకు గురైన, తెగిపోయిన, గుంతలు పడిన వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టేలా పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, ఎక్కడైనా వంగిపోయిన విద్యుత్ స్తంభాలు, వేలాడే వైర్లు ఉంటే సరిచేయాలని, ఎవరు విద్యుత్ ప్రమాదాలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.
దేవరకొండ డివిజన్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనందున ఈ ప్రాంతంలోని మారుమూల, గిరిజన తండాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఇక్కడి క్షేత్రస్థాయి సిబ్బంది క్షేత్రస్థాయిలో నే అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు.
మొంథ తుఫాన్ కారణంగా భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో 24 గంటలు పని చేసే విధంగా సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆయా శాఖల అధికారులను ఆమె ఆదేశించారు. ప్రజలు వర్షానికి సంబంధించిన సమాచారాన్ని కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ 18004251442 కు తెలియజేయాలని ఆమె కోరారు.
MOST READ :
-
District collector : వర్షంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.. కీలక సూచన..!
-
Wines Tenders : అదృష్టవంతుడు అంటే ఇతడే.. ఐదు వైన్స్ లకు టెండర్లు వేస్తే ఐదు దక్కాయి..!
-
Wines Tenders : మద్యం టెండర్లలో భార్యాభర్తలను వరించిన అదృష్టం..!
-
Friendship : స్నేహమంటే ఇదే.. స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు..!
-
Wrong Route : రాంగ్ రూట్ లో వెళ్తున్న బైక్ ఆపిన పోలీసులు.. చలాన్లు చూసి కంగుతిన్నారు..!









