District collector : డ్రగ్స్ కు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ వినూత్న ప్రచారం..!
District collector : డ్రగ్స్ కు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ వినూత్న ప్రచారం..!
పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి:
డ్రగ్స్ మత్తు పదార్థాల వాడకాన్ని యువత తీవ్రస్థాయిలో వ్యతిరేకించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఏర్పాటు క్యాంపెయిన్ లో చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గోన్నారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఐ యామ్ ఆంటి డ్రగ్ సోల్డియర్ ( I am Anti Drug Soldier) ఫోటో పాయింట్ వద్ద కలెక్టర్ ఫోటో తీసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,యువత చెడు అలవాట్లు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు. సరదా కోసం ప్రారంభమయ్యే డ్రగ్స్ లాంటి అలవాట్లు మన జీవితాలను నాశనం చేస్తాయని అన్నారు.
డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. డ్రగ్స్ కు బానిసైన వారి కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. డ్రగ్స్ కు సంబంధించి ఎటువంటి సమాచారం తెలిసినా ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ 14446 కు వెంటనే అందించాలని కలెక్టర్ సూచించారు.
విద్యార్థులు సరైన మార్గంలో నడిచేలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. పిల్లలు చెడు అలవాట్లు చేసుకోకుండా చూడాలని, ఎప్పుడైనా విచిత్రంగా ప్రవర్తిస్తే వెంటనే దానికి గల కారణాలు తెలుసుకోవాలని సూచించారు.
ఏదైనా అలవాట్లు ఉంటే మాన్పించేందుకు ప్రభుత్వ యంత్రాంగం, వైద్యశాఖలో ఉన్న నిపుణుల సహకారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పి. వేణు గోపాల రావు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Nalgonda : నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స..!
-
Gold Price : కుప్పకూలిన గోల్డ్.. ఈరోజు తులం ఎంతంటే..!
-
TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు..!
-
Teacher : ఉపాధ్యాయులకే ఆమె ఆదర్శం.. ఎందుకో, ఏంటో.. తెలుసుకోవాల్సిందే..!
-
Youth: అప్పు చేసి పప్పు కూడు కు స్వస్తి.. వ్యక్తిగత రుణాలపై ఆసక్తి తగ్గుదల..!









