District Collector : నూతన సర్పంచులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. శిక్షణ శిబిరం ప్రారంభం..!
నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు ప్రజలకు మెరుగైన పాలన అందించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు.

District Collector : నూతన సర్పంచులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. శిక్షణ శిబిరం ప్రారంభం..!
నల్లగొండ, మన సాక్షి
నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు ప్రజలకు మెరుగైన పాలన అందించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. ఇటీవల నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికలలో కొత్తగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచ్ లకు ఉద్దేశించి సోమవారం నుండి ఫిబ్రవరి 28 వరకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం అయన నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని టీటీడీసీలో జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
మొదటి బ్యాచ్ లో శిక్షణను నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గాలలోని మండలాలు, అలాగే తుంగతుర్తి నియోజకవర్గం లోని శాలిగౌరారం మండల సర్పంచ్ లకు 5 రోజులపాటు ఇవ్వనున్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ నూతన సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజలు సర్పంచులకు కల్పించిన ఒక గొప్ప అవకాశం అని అన్నారు.
మహాత్మా గాంధీ చెప్పినట్లు గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గ్రామాలలో ప్రజా సమస్యలుతీర్చడంలో,ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో సర్పంచులది కీలకపాత్ర అని అన్నారు. చట్టపరంగా సర్పంచుల హక్కులు, బాధ్యతలు, వివిధ ప్రభుత్వ పథకాల వివరాలు సమగ్రంగా తెలుసుకొని ప్రజలకు సుపరిపాలన అందించాలని నూతన సర్పంచ్ లతో కోరారు.
5 రోజుల శిక్షణా కార్యక్రమంలో అన్ని విషయాలను క్షుణ్ణంగా చర్చించడం,జరుగుతుందన్నారు. సర్పంచులు మంచి నడవడికతో ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారికి దక్కిన పదవి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ,ఆర్ డి ఓ అశోక్ రెడ్డి మాట్లాడారు.
డిప్యూటీ కమిషనర్ కె. అనిల్ కుమార్, హైదరాబాద్ ట్రైనింగ్ సెంటర్ హెడ్ డి. రాఘవేంద్రరావు, డిపిఓ శంకర్ నాయక్, జెడ్పి సీఈవో శ్రీనివాసరావు, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్, తదితరులు ఉన్నారు.
MOST READ NEWS :
-
Cyber Crime : రూ.5 వేలు ఇచ్చారు.. రూ.2.9 కోట్లు కొట్టేశారు..!
-
Nalgonda : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య.. హైదరాబాద్ తరహాలో నల్గొండ..!
-
BIG BREAKING : ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్తుండగా కారు ప్రమాదం.. ప్రధానోపాధ్యాయురాలు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు..!
-
Post Office : లక్షకు రెండు లక్షలు.. రూ.5 లక్షలకు రూ.10 లక్షలు.. పోస్ట్ ఆఫీస్ గొప్ప స్కీం, కేంద్రం మద్దతు గ్యారెంటీ రిటర్న్స్..!
-
Rythu Bharosa : రైతులకు శుభవార్త.. రైతు భరోసా పై కీలక అప్డేట్..!











