Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Uncategorized

Nalgonda : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య.. హైదరాబాద్ తరహాలో నల్గొండ..!

నల్లగొండ కార్పొరేషన్ గా అప్గ్రేడ్ కావడంతో, హైదరాబాద్ మాదిరిగా నల్లగొండను అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ ,శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు

Nalgonda : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య.. హైదరాబాద్ తరహాలో నల్గొండ..!

నల్లగొండ, మన సాక్షి :

నల్లగొండ కార్పొరేషన్ గా అప్గ్రేడ్ కావడంతో, హైదరాబాద్ మాదిరిగా నల్లగొండను అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ ,శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం 48 వ వార్డు చింతల్ పార్కులో 2.25 కోట్లతో చింతల్ పార్క్ రాంనగర్ పార్క్, మామిల్లగూడెం పార్క్, రాజీవ్ పార్కుల, అభివృద్ధి పనులకు 1, 50 కోట్లతో ఎన్జీ కాలేజీ నుండి రామగిరి వరకు రహదారి విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 18.7 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కావటం వల్ల కేంద్రం నుండి నేరుగా నిధులు తెచ్చేందుకు అవకాశం ఉందన్నారు.

25 నెలల్లోనే కార్పొరేషన్ తీసుకువచ్చానని గతంలో కన్నా ఇంకా వేగంగా నల్గొండను అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉందన్నారు. హైదరాబాద్ లా నల్గొండను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.
నల్గొండ కార్పొరేషన్ లో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ తో పాటు, 700 కోట్లతో ఓఆర్ఆర్ నిర్మాణం పనులు నడుస్తున్నాయన్నారు.

ధర్వేశిపురం వరకు 6 లైన్ల రోడ్.140 కోట్లతో
బ్రహ్మ గారి గుట్ట ,లతీప్ సాబ్ దర్గా గుట్ట అభివృద్ధి. దొరేపల్లి ,అనంతారం వరకు రోడ్లు.ఎస్ఎల్ బిసీని పూర్తి చేయడమే లక్ష్యం . ఏ ఎం ఆర్ పి కాలువల లైనింగ్ కి 450 కోట్లు మంజూరు చేయించాను.

బ్రాహ్మణ వెళ్లెముల ప్రాజెక్టు ద్వారా మునుగోడు, చండూరులకు సైతం సాగునీరు. @ నల్గొండ ప్రజలందరూ మాట సమరస్యంతో శాంతియుతంగా ఉండాలన్నారుకార్పొరేషన్ అభివృద్ధికి సహకారం అందించాలని రాజకీయాల కతీతంగా నల్గొండను అభివృద్ధి చేస్తామని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం. కార్పోరేషన్ పరిధిలో అన్ని వార్డులో సిసి రోడ్లు భూగర్భ మురికి కాలువలతో అభివృద్ధి చేస్తాం. నల్గొండ కార్పొరేషన్ ను సీఎంకు గిఫ్టుగా ఇవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి , మాజీ జెడ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆఫీజ్ ఖాన్ , మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు నాల్ల వెంకటేశ్వర్లు,

పారేపల్లి శ్రీనివాస్, బోనగిరి ప్రభాకర్, నాంపల్లి మనోహర్, రాచకొండ గిరి , భావన శ్రీనివాసరావు, పాదం అనిల్ , నల్గొండ అశోక్,గట్టు వెంకన్న, గట్టు రాము, కత్తుల కోటి నాంపల్లి నరసింహ, మాజీ కౌన్సిలర్లు, ప్రతి క్ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. Nalgonda : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య.. హైదరాబాద్ తరహాలో నల్గొండ..!

  2. Municipal Elections : మున్సిపల్ చైర్ పర్సన్స్ రిజర్వేషన్ల ఖరారు.. రాష్ట్రంలోని మున్సిపల్ రిజర్వేషన్లు ఇవీ..!

  3. BIG BREAKING : ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్తుండగా కారు ప్రమాదం.. ప్రధానోపాధ్యాయురాలు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు..!

  4. MEO : మండల విద్యాధికారిగా మంజూష రాణి.. ఎవరో తెలుసా..! 

మరిన్ని వార్తలు