Miryalaguda : ఘనంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ప్రమాణ స్వీకార మహోత్సవం.. నూతన అధ్యక్షులుగా కుటాలా రాంబాబు..!
మిర్యాలగూడ పట్టణంలోని హోటల్ వైష్ణవి గ్రాండ్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిర్వహించిన 53వ ఇన్‌స్టాలేషన్ (ప్రమాణ స్వీకార) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

Miryalaguda : ఘనంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ప్రమాణ స్వీకార మహోత్సవం.. నూతన అధ్యక్షులుగా కుటాలా రాంబాబు..!
అభిందించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలోని హోటల్ వైష్ణవి గ్రాండ్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిర్వహించిన 53వ ఇన్‌స్టాలేషన్ (ప్రమాణ స్వీకార) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ము నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన లయన్ కుటాల రాంబాబు కు శుభాకాంక్షలు తెలియజేసి, నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సమాజ సేవే ధ్యేయంగా పనిచేస్తున్న లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు.
సమాజ అభివృద్ధి, విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ గుడిపాటి శిరీష నవీన్, రైస్ మిలర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.










