Uncategorized
Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. కంట్లో కారం చల్లి తల్లి, కూతురి హత్య..!
నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కంట్లో కారం చల్లి తల్లి కూతుళ్ళను దారుణంగా హత్య చేశారు.

Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. కంట్లో కారం చల్లి తల్లి, కూతురి హత్య..!
నల్గొండ, మన సాక్షి :
నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కంట్లో కారం చల్లి తల్లి కూతుళ్ళను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్ష సుమలత, రుద్రాక్ష లావణ్యలు తమ ఆయిల్ ఫామ్ తోటలో పనులు చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కంట్లో కారం చల్లి గొంతు నులిమి చంపేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు పరిశీలించారు. జంట హత్యలకు భూ తగాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు చేపట్టారు హాత్యలకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి :









