Breaking Newsజాతీయం
Flash News : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!
దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. ఒక్కొక్క లీటర్ పై సగటున మూడు రూపాయల ధర పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.

Flash News : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!
మన సాక్షి, వెబ్ డెస్క్..!
దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. ఒక్కొక్క లీటర్ పై సగటున మూడు రూపాయల ధర పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈనెల 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. శుక్రవారం నుంచి పెరిగిన ధరలు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు మారనున్నాయి.
తెలంగాణలో పెట్రోల్ డీజిల్ పై మూడు రూపాయలు చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ పై 3.29 రూపాయలు, డీజిల్ పై 3.14 రూపాయలు పెంచాయి.
పెట్రోల్ : ఢిల్లీ లో రూ. 97.77 (+3.00), కోల్ కత లో 108.74 (+3.14), చెన్నై లో 103.67 (+2.83), ముంబై లో 106.68 (3.14) ఉన్నాయి.
డీజిల్ : ఢిల్లీ లో రూ. 90.67 (+3.00), కోల్ కత లో 95.13 (+3.11), చెన్నై లో 95.25 (+2.86), ముంబై లో 93.14 (+3.14ల్ ఉన్నాయి.









