Hyderabad : నేటి నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు మూసివేత.. మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
ఉప్పల్ రింగ్ రోడ్డును మూడు నెలల పాటు మూసివేయనున్నారు. ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల నిమిత్తం మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Hyderabad : నేటి నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు మూసివేత.. మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
హైదరాబాద్, మన సాక్షి :
ఉప్పల్ రింగ్ రోడ్డును మూడు నెలల పాటు మూసివేయనున్నారు. ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల నిమిత్తం మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా :
రామంతపూర్ లేదా హబ్సిగూడ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు, పిస్తా హౌస్ మరియు లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక నుండి బీరప్పగడ్డ మీదుగా వరంగల్ జాతీయ రహదారిని చేరుకోవాలి.
నాగోల్ మరియు ఎల్.బి. నగర్ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు, హయత్ నగర్ మీదుగా ఘట్కేసర్ వద్ద, లేదా పెద్దా అంబర్‌పేట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా గానీ, లేదా సర్వీస్ రోడ్డు ద్వారా గానీ వరంగల్ జాతీయ రహదారిని చేరుకోవాలి.
పీర్జాడిగూడ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలు, ఉప్పల్ జంక్షన్‌కు చేరుకోవడానికి ముందు లక్ష్మా రెడ్డి కాలనీ గుండా వెళ్లి, ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న మాస్టర్ చెఫ్ రెస్టారెంట్‌కు చేరుకుని, అక్కడ యూ-టర్న్ తీసుకుని సికింద్రాబాద్ వైపు వెళ్లాలి.
పీర్జాడిగూడ నుంచి నాగోల్ చేరుకోవడానికి, ఉప్పల్ భాగ్యత్ లేఅవుట్ మీదుగా వెళ్లాలి. నాగోల్ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు కూడా భాగ్యత్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
హుబ్సిగూడ నుంచి నాగోలు వైపు వెళ్లే వాహనాలపై ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు లేవు.