Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. రోడ్డుపై వరి ధాన్యాన్ని పోసి తగలబెట్టిన రైతులు..!

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కోనే దిక్కు లేక అయోమయంలో పడుతున్నారని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్ ఆవేదన వ్యక్తపరిచారు.

Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. రోడ్డుపై వరి ధాన్యాన్ని పోసి తగలబెట్టిన రైతులు..!

రైతుల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం గద్దె దిగాలి.. 

దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

చింతపల్లి, మనసాక్షి :

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కోనే దిక్కు లేక అయోమయంలో పడుతున్నారని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్ ఆవేదన వ్యక్తపరిచారు. శుక్రవారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ ఎదురుగా నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొని రైతులను ఉద్దేశించి వారు మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమాలు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు.

తప్ప రైతన్నలకు చేసేది శూన్యం అన్నారు. రైతులు అప్పులు తెచ్చి పంట పండిస్తే కొనే నాథుడు బ్రోకర్ల బారిన పడకుండా మార్కెట్ యార్డ్ కు రైతులకు హామీ ఇచ్చిన ప్రభుత్వం కూడా వరి ధాన్యాన్ని కొనలేని పరిస్థితుల్లో దివాలా తీస్తుందన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులకు సకాలంలో గన్ని బ్యాగులు అందించే పరిస్థితిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేదన్నారు. తరుగు పేరిట కొనుగోలుదారులు 2 కేజీలు కట్ చేస్తూ మిల్లర్లు3 కేజీలు కట్ చేస్తున్నారని రైతులు వాపోతున్నారని వారు ఆవేదన వ్యక్తపరిచారు.

అధికారులు సైతం ప్రభుత్వానికి వంత పాడుతూ రైతులను మోసం చేస్తున్నారన్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా రోడ్డుపై ధర్నా నిర్వహించడం తోనైనా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్ మాజీ పిఎసిఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి, వివిధ మండలాల రైతులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు