తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. లంచం అడిగితే క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. లంచం అడిగితే క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు..!

నలగొండ, మన సాక్షి.

లంచం అడగడం, తీసుకోవడం నేరమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ నెల 3 నుండి 9 వరకు నిర్వహించనున్న తెలంగాణ ఏసీబీ వారోత్సవాలలో భాగంగా బుధవారం ఆమె తన చాంబర్లో లంచం నేరమని తెలిపేలా రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.

పరిపాలనలో పారదర్శకత అవసరమని, ఎవరైనా ప్రభుత్వ అధికారి, ఉద్యోగి లంచం అడిగితే వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి తెలియజేయాలని ఆమె తెలిపారు. కాల్ చేసిన వారి పేరును గోప్యంగా ఉంచడం జరుగుతుందని, అవినీతిని అరికట్టడంలో ప్రతి ఒక్కరు సహకరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

అవినీతిని అరికట్టడంలో భాగంగా సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని, వాట్సాప్ నంబర్ 9440 446106, ఫేస్బుక్ ఏసీబీ తెలంగాణ ఎక్స(పాత ట్విట్టర్) అలాగే పోస్టర్ లో ముద్రించిన క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎసిబి డిఎస్పి జగదీష్ చందర్, ఇన్స్పెక్టర్ వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. CM Revanth Reddy : మోదీజీ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రండి.. మా ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడి..!

  2. Gold Price : దిగి వచ్చిన గోల్డ్ ధర.. కొనుగోలుకు ఇదే మంచి సమయమా..!

  3. PM KISAN : రైతులకు గుడ్ న్యూస్.. వారికి ఒకేసారి రూ.4వేలు ఖాతాలలో జమ..!

  4. District collector : ప్రసూతి వార్డులో పురుషులు ఉండడం ఏంటి.. జిల్లా కలెక్టర్ ఆగ్రహం..!

మరిన్ని వార్తలు