తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తక్కువ ధరలకు ఇటుకలు.. రేట్ ఫిక్స్..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తక్కువ ధరలకు ఇటుకలు.. రేట్ ఫిక్స్..!

పెద్దపల్లి (ధర్మారం), మన సాక్షి:

పెద్దపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇటుకలను ఒక్కో ఇటుక రూ:5.50 పైసలకు సరఫరా చేసేందుకు ఇటుక బట్టీల యాజమానులు నిర్ణయించారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష*మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇటుక బట్టీల యాజమాను లతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకానికి పెద్దపల్లి జిల్లాలో ఉన్న 102 ఇటుక బట్టీల నుంచి తక్కువ ధరకు ఇటుక సరఫరా చేయాలని వారిని ఒప్పించడం జరిగింది.

మొదటి విడత కింద పెద్దపల్లి జిల్లాకు ప్రభుత్వం 9 వేల 421 ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపు చేయగా ఇప్పటివరకు 6 వేల 18 ఇండ్లను లబ్ధిదారులకు మంజూరు చేసామని, 3 వేల 847 గృహాలకు మార్కింగ్ చేసి బేస్మెంట్ పనులు జరుగుతున్నాయని అన్నారు.

ప్రతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 12,000 ఇటుకల అవసరం అవుతాయని, ఒక్కో ఇటుక 5 రూపాయల 50 పైసలకు సరఫరా చేసేందుకు జిల్లాలో ఉన్న 102 ఇటుక బట్టీల యాజమాన్యుల సమావేశంలో నిర్ణయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

పెద్దపల్లి, శ్రీరాంపూర్, పాలకుర్తి, కమాన్ పూర్ మండలాల్లోని లబ్ధిదారులకు పెద్దపల్లి మండలంలో తయారుచేసిన ఇటుక బట్టీల నుంచి, సుల్తానాబాద్ ఓదెల, ఎలిగేడు, జూలపల్లి మండలాల్లోని లబ్ధిదారులకు సుల్తానాబాద్ మండలంలో తయారుచేసిన ఇటుక బట్టీల నుంచి సరఫరా అవుతుందని అన్నారు.

ధర్మారం మండలంలోని ఇటుక బట్టీలు ధర్మారం మండలానికి,రామగిరి ,రామగుండం మండలాల్లో తయారు అయ్యే ఇటుక బట్టీల నుంచి రామగిరి మంథని ముత్తారం మంథని మండలాలకు ఇటుకల సరఫరా అవుతాయని కలెక్టర్ తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల కోసం అవసరమైన ఇటుకలను ప్రతి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడు ఎంపీడీవో,పంచాయతీ కార్యదర్శి ద్వారా ఒకేసారి లిఫ్ట్ చేయుటకు వాహన సంఖ్య తో పర్మిట్ లెటర్ ఎంపీడీవో ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను పూర్తి స్థాయిలో త్వరగా నిర్మించుకోవాలని, ఈ ప్రక్రియను పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి, పిడి హౌసింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

MOST READ : 

  1. TG News : జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. సామాన్యులకు ఊరుట..!

  2. Nalgonda : నల్గొండ జిల్లాలో వెలుగులోకి మానవ అక్రమ రవాణా.. వెట్టి చాకిరి.. ముఠా అరెస్ట్..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేసే అలవాటు మీకు ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

  4. Nalgonda : మీ ఊరిలో మీరే రేవంత్ రెడ్డి, మీరే కోమటిరెడ్డి.. ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..!

  5. TG News : యూరియా, ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!

మరిన్ని వార్తలు