Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District collector : మండల అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఆ బాధ్యత వారిదే..!

District collector : మండల అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఆ బాధ్యత వారిదే..!

నల్లగొండ, మన సాక్షి  :

మండల ప్రత్యేక అధికారులు వారి పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను, ఇతర ప్రభుత్వ సంస్థలను తప్పనిసరిగా సందర్శించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రాధామ్య పథకాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత మండల ప్రత్యేక అధికారులపై ఉందని అన్నారు.

వారి పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలను తరచు ప్రత్యేక అధికారులు తనిఖీ చేయడమే కాకుండా, సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

అనంతరం జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్షిస్తూ మండలాల ప్రత్యేక అధికారులు వారి పరిధిలోని ప్రభుత్వ కార్యక్రమాలు, సంస్థలను తనిఖీ చేసినప్పుడే ప్రభుత్వ పథకాల అమలు తీరు తెలుస్తుందని, అందువల్ల ఇకపై తప్పనిసరిగా ప్రతి ప్రత్యేక అధికారి రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలతో పాటు, ఇతర సంస్థల ను సందర్శించి ప్రభుత్వ ప్రాధామ్య పథకాల అమలు తీరును తప్పనిసరిగా తనిఖీచేయాలని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల సందర్శన సందర్భంగా సీజనల్ వ్యాధుల తో పీహెచ్సీలకు వస్తున్న రోగులు ,అందిస్తున్న సేవలు, మందుల అందుబాటు వంటి వివరాలను చూడాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛత పై రూపొందించిన “హర్ ఘర్ తిరంగా హార్ ఘర్ స్వచ్ఛత” గోడపత్రికను ఆవిష్కరించారు.

రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్పెషల్ కలెక్టర్ సీతారామారావు, ఇంచార్జ్ డి ఆర్ ఓ నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి,ఆర్ డి ఓ లు రమణారెడ్డి, శ్రీదేవి , గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

MOST READ : 

  1. Rythu Bima : 18 ఏళ్లు నిండిన వారికి ఐదు లక్షల బీమా.. రెండు రోజులే గడువు.. కావలసిన పత్రాలు ఇవీ..!

  2. Rythu Bheema : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమాకు దరఖాస్తుల స్వీకరణ..! 

  3. Agricultural Tools : రైతులకు శుభవార్త.. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు.. దరఖాస్తులు స్వీకరణ..!

  4. TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!

  5. Blood Group : మీకు ఆ బ్లడ్ గ్రూప్ ఉంటే స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ.. అధ్యయనంలో నిర్ధారణ..!

మరిన్ని వార్తలు