Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. యధావిధిగా ప్రజావాణి..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. యధావిధిగా ప్రజావాణి..!
నల్గొండ, మనసాక్షి :
ఎంపిటిసి, జెడ్పిటిసి, గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాష్ట్ర హై కోర్ట్ ఆదేశాలమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపి వేసినందున ఈనెల 13 (సోమవారం) న ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.
అందువల్ల సమస్యల పరిస్కారం నిమిత్తం ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించదల్చుకున్న వారు సోమవారం వారి దరఖాస్తులను నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలనుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సమర్పించవచ్చని ఆమె స్పష్టం చేశారు. జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
MOST READ :
-
ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసిల్దార్..!
-
Garlic : వెల్లుల్లి తింటే కలిగే అద్భుత ఆరోగ్య లాభాలు.. ఏ సమయంలో తినాలో తెలుసా..!
-
Chinese Wok : తెలుగు రాష్ట్రాల్లో చైనీస్ వోక్ విస్తరణ.. సరికొత్త ప్రచారం షురూ..!
-
Platelets : ప్లేట్‌లెట్స్ పడిపోయాయా.. అయితే ఇలా తిరిగి పొందండి ఈజీ..!
-
Nalgonda : అధిక వడ్డీ ఆశచూపి రూ.100 కోట్లు వసూలు.. అప్పు తీర్చకపోవడంతో వడ్డీ వ్యాపారి ఇంటికి నిప్పు పెట్టిన బాధితులు..!









