District collector : కనికరించని మండల స్థాయి అధికారులు.. నిమిషంలో స్పందించిన కలెక్టర్..!

District collector : కనికరించని మండల స్థాయి అధికారులు.. నిమిషంలో స్పందించిన కలెక్టర్..!
నల్లగొండ, మన సాక్షి :
తన కుమారుడికి మూడు నెలలుగా పెన్షన్ రావడం లేదు. మండల స్థాయి అధికారుల వద్దకు వెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లిన వెంటనే ఆమె ఒక్క నిమిషంలో స్పందించి సమస్యను పరిష్కరించారు. వివరాల ప్రకారం..
నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నెల్లి కళ్ళు గ్రామానికి చెందిన బోయ సత్యనారాయణ రెడ్డి కుమారుడు బోయ వెంకటరామిరెడ్డి (18) పోలియో వ్యాధితో మానసికంగా శారీరకంగా ఎదగక ఇప్పటికీ మరుగుజ్జుగానే ఉంటూ సొంత పనులు కూడా చేసుకోలేని నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రుల పర్యవేక్షణలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ బతుకుతున్నాడు.
అయితే ప్రభుత్వం ఇతనికి వికలాంగుల పింఛన్ మంజూరు చేసి పింఛన్ ఇస్తున్నారు. బయోమెట్రిక్ సిస్టం తీసేసిన ప్రభుత్వం మూడు నెలల క్రితం ఫేషియల్ రీడింగ్ ద్వారా పింఛన్ బట్వాడా చేస్తుంది. దీంతో వెంకటరామిరెడ్డికి కండ్లు కంప్యూటర్ల లో స్పష్టంగా కనపడకపోవడం తో పింఛన్ పంపిణీ చేసేవారు మూడు నెలలుగా పింఛన్ ఇవ్వడం లేదు. దీంతో అతని మందులకు ఖర్చులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
వెంకటరామిరెడ్డి తల్లిదండ్రులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ఇలా త్రిపాఠి నీ కలిసి దీనస్థితిలో ఉన్న కుమారుని చూయించి పింఛను ఆపారని వెంటనే ఇవ్వాలని కలెక్టర్ కోరారు, కలెక్టర్ పరిస్థితిని చూచి వెంటనే మండలాధికారులకు ఫోన్ చేసి వెంకటరామిరెడ్డికి పింఛన్ ఇవ్వాలని ఫోన్ లోనే ఆదేశించారు.
ఈ విషయం బాధితునికి తెలిపి వెంటనే నెల్లికలు వెళ్లి పింఛన్ తీసుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రజావాణిలో చిన్న చిన్న సమస్యలకు కూడా జిల్లా కేంద్రానికి బాధితులు రావడం బాధాకరం. సాధ్యమయ్యే సమస్యలను మండల కేంద్రాలలోని పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.
MOST READ :
-
Miryalaguda : రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశం..!
-
Karimnagar : వైద్యం కోసం వెళ్తే.. మత్తు ఇచ్చి యువతీపై అఘాయత్నం..!
-
CM Revanth Reddy : సామాన్యుడిలా సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. (వీడియో)
-
Hyderabad : రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డు రూ.2.31 కోట్లకు వేలం పాట.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి..!









