Nizamabad : దుబాయ్ లో గుండె పోటుతో నిజామాబాద్ జిల్లా వాసి మృతి..!
Nizamabad : దుబాయ్ లో గుండె పోటుతో నిజామాబాద్ జిల్లా వాసి మృతి..!
నిజామాబాద్ జిల్లా భీంగల్, మన సాక్షి :
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని పురాణిపేట్ గ్రామానికి చెందిన తోట జడల రాజేశ్వర్ (50)గుండె పోటుతో మృతి చెందడం జరిగింది. పొట్ట చేత పట్టుకుని ఉపాధి నిమిత్తం ఎడారి దేశానికి వెళ్లిన మృతుడు గుండెపోటుతో జనవరి 29 న చనిపోవడం తో కుటుంబం వీధిన పడింది. నిరుపేద రైతు కుటుంబానికి చెందిన మృతుడు గల్ఫ్ కార్మికునిగా పని చేస్తాడు.
జనవరి 16 ఎడారి దేశానికి ఉపాధి నిమిత్తం తిరిగి వెళ్ళాడు. వెళ్లిన 13 రోజులకే గుండెపోటు వచ్చింది. వెంటనే తోటి కార్మికులు అంబులెన్సు లో ఆసుపత్రి కి తరలించారు. ఆసుపత్రి కి చేరుకునే లోపు రాజేశ్వర్ మృతి చెందడం జరిగింది. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. మృత దేహాన్ని తీసుకుని స్వదేశానికి వచ్చేందుకు బంధువులు ఏర్పాటు చేశారు.
ఎనిమిది రోజులకి నేడు మృత దేహం స్వగ్రామనికి చేరుకుంది. రాజేశ్వర్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుని స్వగ్రామం పురాణిపేట్ అయి నప్పటికీ బ్రతుకు దెరువు కొరకు కుటుంబంతో నివసిస్తున్న వేల్పూర్ మండలం కుకునూర్ లో అంత్య క్రియలు నిర్వహించారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో పడలేదా.. అయితే ఇలా చేయండి..!
-
Holidays : విద్యార్థులకు అదురిపోయే న్యూస్.. ఈ నెల్లోనే వరుస సెలవులు..!
-
Miryalaguda : మోడల్ స్కూల్ హాస్టల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఇఓ.. కీలక ఆదేశాలు..!
-
District collector : పెద్దగట్టు జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!









