District SP : శబ్ద కాలుష్యంపై జిల్లా ఎస్పీ కీలక నిర్ణయం.. వాహనాల సైలెన్సర్ లపై రోడ్డు రోలర్..!
District SP : శబ్ద కాలుష్యంపై జిల్లా ఎస్పీ కీలక నిర్ణయం.. వాహనాల సైలెన్సర్ లపై రోడ్డు రోలర్..!
జగిత్యాల, (మన సాక్షి) :
శబ్ద కాలుష్యాన్ని నిరోధించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, అధిక శబ్దం కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లను వినియోగిస్తున్న ద్విచక్ర వాహనాల పై జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ ద్విచక వాహనదారులు అధిక శబ్దం కలిగించే సైలెన్సర్ మాడిఫై చేసి అధిక శబ్దాలతో సౌండ్-పొల్యూషన్ చేస్తూ, సామాన్య ప్రజానికానికి ఇబ్బందులకు గురి చేస్తున్న 130 వాహనాల సైలెన్సెర్స్ లను జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో రోడ్డు రోలర్ తో ధ్వంసం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమని,శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజాఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకోని అధికంగా శబ్దం చేసే ద్విచక్రవాహనలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా వ్యాప్తంగా తనీఖీలు చేపట్టడం జరిగిందన్నారు.
మాడిఫైడ్ సైలెన్సర్లను వాడితే ఆ వాహనాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేస్తాం. డ్రైవింగ్ లైసెన్సును కూడా రద్దు చేయొచ్చు. ప్రజల ఆరోగ్యం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్స్‌ను కొనసాగిస్తూనే ఉంటుంది. జిల్లా ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులు చేపడుతున్న చర్యలకు సహకరించాలని కోరారు.
ఎవరైనా మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తున్న వాహనాలను గమనిస్తే సమీప పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్ ,టౌన్ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ ,ట్రాఫిక్ ఎస్సై మల్లేష్ సిబ్బంది పాల్గొన్నారు.
MOST READ :
-
Employees : ఆ ఉద్యోగులందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం..!
-
Miryalaguda : రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు.. సబ్ కలెక్టర్ ఆదేశం..!
-
Hot Water : ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం మంచిదేనా.. ఎవరు తాగకూడదో తెలుసుకుందాం..!
-
Sleep : నిద్ర పట్టట్లేదా.. ఈ చిట్కాలు పాటించండి..!
-
Hot Water : ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం మంచిదేనా.. ఎవరు తాగకూడదో తెలుసుకుందాం..!









