District SP : జిల్లా ఎస్పీ కీలక నిర్ణయం గణేష్ నిమజ్జన శోభాయాత్రకు పటిష్ట భద్రత..!

District SP : జిల్లా ఎస్పీ కీలక నిర్ణయం గణేష్ నిమజ్జన శోభాయాత్రకు పటిష్ట భద్రత..!
నల్లగొండ/ దేవరకొండ, మన సాక్షి :
నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జరిగే శోభాయాత్ర సందర్భంగా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.
భారీ భద్రత..పటిష్టమైన బందోబస్తు:
శోభాయాత్ర కోసం జిల్లా వ్యాప్తంగా దాదాపు 950 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. ఇందులో ఒక ఏఎస్పీ, ఒక అడిషనల్ ఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 60 మంది ఎస్సైలు, అలాగే ఏఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులు, బాంబ్, డాగ్ స్క్వాడ్‌లు, ఏ.ఆర్. సిబ్బంది, స్పెషల్ పార్టీలు ఉన్నాయి. నిమజ్జన ప్రాంతాలైన వల్లభరావు చెరువు, మూసి నది, 14వ మైలురాయి, వాడపల్లి, నాగార్జునసాగర్, దయ్యాలగండి, అడవిదేవులపల్లి, కొండభీమనపల్లి,డిండి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో ఫ్లడ్‌లైట్లు, క్రేన్‌లు, పోలీసు పికెట్లు,అలాగే గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచారు.
సీసీటీవీల నిఘాలో శోభాయాత్ర:
శోభాయాత్రను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జిల్లాలోని అన్ని ప్రధాన రహదారులతో పాటు, పట్టణంలోని వివిధ కాలనీల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.ఈ కెమెరాల దృశ్యాలను జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు.ఇప్పటికే ‘నేను సైతం’, ‘కమ్యూనిటీ పోలీసింగ్’ ప్రాజెక్టుల కింద సుమారు 1500 సీసీటీవీ కెమెరాలను ఆయా పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేశామని ఎస్పీ తెలిపారు.జిల్లాలోని అన్ని వినాయక విగ్రహాలకు జియో ట్యాగింగ్ కూడా పూర్తి చేసి, వాటి కదలికలను నిరంతరం ట్రాక్ చేస్తారు.
ట్రాఫిక్ మళ్లింపు, నిబంధనలు:
నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండటానికి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. శోభాయాత్ర మార్గంలో ప్రజలు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.అలాగే, డీజేలకు అనుమతి లేదని, బాణాసంచా కాల్చవద్దని ఎస్పీ స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై షీ టీమ్స్ బృందాలు నిఘా ఉంచుతాయని,నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినాయక ఉత్సవ కమిటీలు,భక్తులు పోలీసులకు సహకరించి శోభాయాత్రను విజయవంతం చేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ:
దేవరకొండ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, కేసుల దర్యాప్తు, స్టేషన్ రికార్డులను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, ఆర్డిఓ రమణారెడ్డి, సీఐ వెంకట్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
MOST READ :
-
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.. లభించని మరో ముగ్గురు చిన్నారుల ఆచూకీ..!
-
Power Cut : రేపు పేటలో విద్యుత్ కోత.. వేళలు ఇవే..!
-
TG News : తెలంగాణలో రైతులకు భారీ శుభవార్త..!
-
TG News : తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!
-
Miryalaguda : జడ్చర్ల-కోదాడ హైవె విస్తరణ పనులు వేగవంతం చేయాలి..!









