Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : జిల్లా ఎస్పీ కీలక సూచన.. పోలింగ్ బూత్ లోకి ఇవి తీసుకెళ్లొద్దు..!

Nalgonda : జిల్లా ఎస్పీ కీలక సూచన.. పోలింగ్ బూత్ లోకి ఇవి తీసుకెళ్లొద్దు..!

నల్లగొండ, మన సాక్షి:

గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

జిల్లాలో మూడు దశల్లో జరగనున్న 869 గ్రామ పంచాయతీల ఎన్నికల కోసం ఎస్పీ పర్యవేక్షణలో ఒక అదనపు యస్సి, ఆరుగురు డీఎస్సీలు, 23 మంది సీఐలు, 84 మంది ఎస్ఐలతో పాటు మొత్తం 1,680 మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

జిల్లా వ్యాప్తంగా 442 గ్రామ పంచాయతీలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి, ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో అదనపు బలగాలు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్ పార్టీలు పర్యవేక్షణ చేస్తాయని ఎస్పి తెలిపారు. పోలింగ్ రోజున ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

.జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే పాత నేరస్తులు, రౌడీ షీటర్ల కదలికలను కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, గత ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన 1,141 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేసి, మళ్లీ నేరాలకు పాల్పడకుండా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. బైండోవర్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మంటను ప్రేరేపించే వస్తువులు తీసుకురావడానికి అనుమతి లేదని సూచించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో 163 (బి.ఎన్.ఎస్.ఎస్) యాక్ట్ అమలులో ఉంటుందని, నలుగురికి మించిన గుంపులు ఉండకూడదని చెప్పారు. పోలింగ్ కేంద్రాల నుండి 100 మీటర్ల పరిధిలో అనవసరంగా ఎవరూ ఉండరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

పోలింగ్ కేంద్రాల్లో లేదా పరిసర ప్రాంతాల్లో ఓటర్లను ప్రలోభపెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగదు, మద్యం లేదా ఇతర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు ఎవరికైనా తెలిసితే, వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళిని అతిక్రమించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ, ప్రజలంతా శాంతియుత ఎన్నికల నిర్వహణకు పోలీసులకు సహకరించాలని కోరారు.

MOST VIEWS 

  1. ACB : రూ.15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఇంచార్జ్ ఏఈ..!

  2. INSURANCE : పోస్టల్ శాఖ భారీ గుడ్ న్యూస్.. రూ.750 చెల్లిస్తే 15 లక్షల ఇన్సూరెన్స్.. ఇలా సద్వినియోగం చేసుకోండి..! 

  3. EV : సరికొత్త ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ కారు.. గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..!

  4. SBI : ఎస్బిఐలో పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఉద్యోగాలు.. గడువు లేదు త్వరపడండి..!

మరిన్ని వార్తలు