తెలంగాణBreaking News

Family Survey : మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా..? సర్వే అంతా కోడ్ లోనే..!

Family Survey : మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా..? సర్వే అంతా కోడ్ లోనే..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కుల, ఆర్థిక గణన పలు గ్రామాలలో బహిష్కరించడంతో పాటు అనేక మంది కూడా యక్ష ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పడం లేదు.

సర్వే చేసే ఎన్యుమరేటర్లకు తలనొప్పిగా మారింది. ఈనెల 6వ తేదీన కుటుంబ సమగ్ర సర్వే ప్రారంభం కాగా ఇంటింటికి బ్లాక్ నెంబర్లు వేయటం రెండు రోజులపాటు చేపట్టారు.

9వ తేదీ నుంచి సర్వే చేస్తున్నారు. కాగా సర్వే చేసే ఎన్యుమరైటర్లు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మొత్తంగా 75 ప్రశ్నలతో సర్వే బుక్ లెట్ ను ఎన్యుమరేటర్లు పూర్తి చేస్తున్నారు.

కాగా సర్వే బుక్లెట్లో ప్రజల ముందే పూర్తి చేసినప్పటికీ ప్రతి ప్రశ్నకు కూడా కోడ్ నెంబర్లతో పూర్తి చేస్తున్నారు. వారి ముందే కోడ్ నెంబర్లు వేసి పూర్తి చేయడంతో తప్పులు వేస్తున్నారో..? ఒప్పులు వేస్తున్నారో కూడా తెలిసే పరిస్థితి లేదు.

సర్వేలో ఉన్న ప్రశ్నల్లో మీ ఇంట్లో టీవీ ఉందా..? ఉంది అని కానీ లేదు అని కానీ రాయరు దానికి బదులుగా కోడ్ నెంబర్ వేస్తున్నారు. అదేంటని కొంతమంది ఎన్యుమరేటర్లను అడుగుతున్నారు.

వాళ్ళకి ఇచ్చిన బుక్లెట్లో ఉన్న కోడ్ ద్వారా సర్వే ఫామ్ నింపుతున్నట్లుగా పేర్కొంటున్నారు. సర్వేలో తప్పులు వస్తున్నాయో..? ఒప్పులు వస్తున్నాయో..? అర్థం కాని విధంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.

ఇవేం ప్రశ్నలు :

సర్వేలో 75 ప్రశ్నల్లో ప్రజలు చెప్పాల్సిన వాటిలో ఇవేం ప్రశ్నలని నోరెళ్ళ పెడుతున్నారు. ఇంటి నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు ఏంటి..? అని కూడా ప్రశ్నల్లో ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇంటికి కరెంటు ఉందా…? కంప్యూటర్ ఉందా ఫ్రిజ్..? ఉందా వాషింగ్ మిషన్ ఉందా..? ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారో దేనికి అడుగుతున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది.

ఇది ఇలా ఉండగా మీ ఇంట్లో రాజకీయ పార్టీలో పాల్గొనే వారు ఎవరైనా ఉన్నారా..? ప్రజాప్రతినిధులుగా చేసిన వారు ఉన్నారా..? ఈ ప్రశ్నలతో ప్రజలు అవాక్కైతున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు