TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Doctorate : ఆటో డ్రైవర్ కుమారుడికి డాక్టరేట్.. మాజీ సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో పరిశోధన..!

Doctorate : ఆటో డ్రైవర్ కుమారుడికి డాక్టరేట్.. మాజీ సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో పరిశోధన..!

వేములపల్లి, మన సాక్షి :

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే నినాదాన్ని పట్టుకొని వేములపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ నిరుపేద ఆటో డ్రైవర్ కుమారుడు షేక్ జావిద్ ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టర్ పట్టా సాధించడం చాలా గర్వకారణం అని అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

గురువారం డాక్టరేట్ పొందిన సందర్భంగా షేక్ జావీద్ విలేకరులతో మాట్లాడుతూ, నా చిన్ననాటి నుండి మా నాన్న మా కుటుంబం కోసం ఎంతో కష్టపడి ఆటో నడుపుతూ మా కుటుంబ సభ్యులందరినీ పోషించాడు.

ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మా నాన్న కష్టం వృధా కాకూడదని ఎంతో కష్టపడి చదువుకొని జీవితంలో ఏదో ఒకటి సాధించాలని కృషి పట్టుదలతో, ఎన్ని కష్టాలను వచ్చినా అట్టి కష్టాలను అధిగమించుకుంటూ పట్టుదలతో ముందుకు సాగి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓరియంటల్ తెలుగు విభాగం నుండి పీ.హెచ్. డి పట్టా పొందడం జరిగింది.

అంతేకాకుండా తెలుగులో ముస్లింవాద సాహిత్యము, సామాజిక వాస్తవికత అనే అంశంపై మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు పర్యవేక్షణలో, తన పరిశోధన పూర్తి చేశారు. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి ఉన్నత విద్యా శిఖరాన్ని అవరోధించడం ద్వారా యువతకు ఆదర్శంగా నిలిచారని తన సహచర బంధువులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆర్ట్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసిం, పాలమూరు విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ చెవ్వ వెంకట్ రెడ్డి, ఎన్. బి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సిద్ధార్థ, వేములపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, వేములపల్లి గ్రామం మాజీ సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్ పలువురు గ్రామ ప్రజలు ఆయనను కొనియాడారు.

MOST READ : 

  1. BC Reservations : 42 శాతం బీసీ రిజర్వేషన్లకు గవర్నర్ ఆమోదం.. ఇక స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్..!

  2. Nalgonda : రూ.52 లక్షల విలువైన 207 కేజీల గంజాయి దగ్దం..!

  3. Penpahad : యూరియా కోసం రైతుల రాస్తారోకో..!

  4. District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి..!

  5. Water Well : బావులు గుండ్రంగానే ఎందుకు ఉంటాయి.. కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

మరిన్ని వార్తలు