క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : వైద్యుల నిర్లక్ష్యం తొ బాలుడి మృతి.. ఆసుపత్రి పై దాడి..!

Suryapet : వైద్యుల నిర్లక్ష్యం తొ బాలుడి మృతి.. ఆసుపత్రి పై దాడి..!

సూర్యాపేట, మనసాక్షి

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్లో( ప్రైమ్ చిన్నపిల్లల హాస్పిటల్ )లో వైద్యుల నిర్లక్ష్యంతోనే మూడు నెలల బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తు హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన చేపట్టారు.

తుంగతుర్తి మండలం గుడి తండా కు చెందిన జాటో జలంధర్ మనిషా దంపతుల కు మొదటి సంతానం కలగగా నాలుగు రోజుల క్రితం బాలుడికి జ్వరం రావడంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పిల్లల ఆస్పత్రికి తీసుకుని వైద్యం చేయించగా మొదటి రెండు రోజులు మంచిగనే ఉన్నదని తెలుపగా రెండు రోజుల నుంచి ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిపిన వైద్యులు పట్టించుకోకుండా తీరా ఆరోగ్య విషమించడంతో ఖమ్మం తీసుకెళ్లాలని లేదా హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పారని అన్నారు.

తీరా ఖమ్మం తీసుకెళ్లాక ఈరోజు బాలుడు అప్పటికే మృతి చెందాడని తెలిపారని వైద్యులు తెలిపారని పూర్తిగా ప్రైమ్ పిల్లల హాస్పిటల్ నిర్లక్ష్యం తోటే తమ బాలుడు మృతి చెందాడని హాస్పటల్లో సరైన వసతులు లేకుండా వైద్యం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు హాస్పిటల్ ను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

హాస్పిటల్ ఎదుట బంధువుల రోధనలతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలుడు మృతి చెందట తొ ఆగ్రహం వ్యకచేస్తూ మృతుడి బంధువులు అస్పత్రి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన పోలీస్ లపైన రాళ్లు రూవ్వాడంతో కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయం అయుంది.

చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ ప్రసన్న కుమార్, సి ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

MOST READ : 

  1. Benz: ఆకర్షణీయమైన స్పోర్ట్స్‌కార్లు.. ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్..!

  2. Indiramma Atmiya Bharosa : రైతు కూలీల ఖాతాలలో డబ్బులు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Hyderabad : హైదరాబాద్ లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..!

  4. Suryapet : సూర్యాపేట మున్సిపల్ కమీషనర్ ఎవరో తెలుసా..!

మరిన్ని వార్తలు