జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనారాయణపేట జిల్లా

District collector : విద్యార్థులకు వసతి గృహాన్ని సిద్ధం చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

District collector : విద్యార్థులకు వసతి గృహాన్ని సిద్ధం చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

మెడికల్ కళాశాలకు సంబంధించిన విద్యార్థుల కోసం అన్ని వసతి సౌకర్యాలతో వసతి గృహాన్ని సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. నారాయణపేట పట్టణంలోని బృందావన్ కాలనీలో గల గొల్ల బాలప్పకు చెందిన బహుళ అంతస్తులో మెడికల్ కళాశాల విద్యార్థుల కోసం నూతనంగా నిర్మించిన వసతి గృహాన్ని బుధవారం కలెక్టర్ పరిశీలించారు.

విశాలమైన ఒక్కో గదిలో ముగ్గురు విద్యార్థులు ఉండేలా కల్పించిన వసతులను ఆమె పరిశీలించారు. మూడు అంతస్తుల వసతి గృహ భవనాన్ని, వసతులను చూసిన కలెక్టర్ లిఫ్టు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు.

వసతి గృహoలోని గదులలో సెల్ చార్జింగ్ సాకెట్లు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలన్నారు. స్వచ్చమైన తాగునీరు ఉండాలని, వసతి గృహం చుట్టూ కట్టుదిట్టమైన ప్రహరిని ఏర్పాటు చేయాలన్నారు. ఇంకా మిగిలిపోయిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించాలన్నారు. వసతి గృహం ఆవరణలో యోగా, జిమ్ ఏర్పాటు కోసం సీసీ స్లాబ్ వేయించాలని ఆదేశించారు.

వసతి గృహాంలో జరుగుతున్న లిఫ్టు నిర్మాణం, ప్లంబింగ్, ఎలక్ట్రిసిటీ, ఫైర్ సేఫ్టీ తదితర ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్, అపార్ట్ మెంట్ యజమాని, కాంట్రాక్టర్ గొల్ల రవి పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు