Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

రేపటి నుంచి దోస్త్ స్పెషల్ డ్రైవ్ అడ్మిషన్లు..!

రేపటి నుంచి దోస్త్ స్పెషల్ డ్రైవ్ అడ్మిషన్లు..!

నల్లగొండ, మనసాక్షి :

నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చివరి దశ అడ్మిషన్ల కోసం దోస్త్ స్పెషల్ డ్రైవ్ విడుదల అయినట్లు ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు.

ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ నెల 4వ తేది నుంచి 9 వ తేది లోపు దోస్త్ వెబ్ సైట్ లో రూ. 400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. దివ్యాంగులు, ఎన్ సి సి, స్పోర్ట్స్, అదనపు సహ పాఠ్యంశాలలో ప్రతిభ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.

వెబ్ అప్షన్లు ఈ నెల 9వ తేదీలోపు ఇవ్వాలని తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా 9వ తేదీనే ఉంటుందని అన్నారు. సీట్ల కేటాయింపు ఈ నెల 11వ తేదీన జరుగుతుందని అన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 13వ తేదీలోపు ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని సూచించారు.

ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ చేయించుకొని సీట్లు పొందని వారు మరియు రిజిస్ట్రేషన్ చేయించుకోనివారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకొని దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

LATEST UPDATE : 

Real Heroes : రియల్ హీరోస్.. రాత్రి, పగలు కష్టపడి వరదలో చిక్కిన పదిమందిని కాపాడిన పోలీసులు..! 

Cm Revanth Reddy : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

Railway : రాత పరీక్ష లేకుండానే రైల్వే జాబ్.. మళ్లీ ఇలాంటి ఛాన్స్ రాదు..!

పోస్టుమేట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం..!

మరిన్ని వార్తలు