Hyderabad : విల్లాలో తాగుబోతుల రచ్చ.. సెక్యూరిటీ గార్డును చితక్కొట్టారు..!
Hyderabad : విల్లాలో తాగుబోతుల రచ్చ.. సెక్యూరిటీ గార్డును చితక్కొట్టారు..!
హైదరాబాద్, మన సాక్షి :
హైదరాబాద్ నగరంలో తాగుబోతులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. డ్రగ్స్, గంజాయి, మద్యం సేవించి విల్లాల్లో చొరబడి నానా రచ్చ చేస్తున్నారు. ఆడుకున్న వారిని కూడా చితక్కొడుతున్నారు. ఇలాంటి సంఘటన శుక్రవారం రాత్రి ఉదయం హైదరాబాద్ నగరంలోని కుత్బుల్లాపూర్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బహుదూర్ పల్లి లోని అయోధ్య విల్లాస్ లో తాగుబోతులు రచ్చ చేశారు. శుక్రవారం ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు విల్లాలోకి చొరబడి కారు అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు అడ్డు వచ్చిన మహిళలను, స్థానికులపై కూడా బూతు పురాణం అందుకున్నారు.
అడ్డుకున్న సెక్యూరిటీ గార్డును కూడా చితకబాదారు. రౌడిల్లా వ్యవహరించారు. ఎంత బతిమిలాడినా మమ్ములనే ప్రశ్నిస్తావా అంటూ పిచ్చకొట్టడు కొట్టారు. దాంతో దుండిగల్ పోలీస్ స్టేషన్లో స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను గుర్తించారు.
నిందితులు సూరారం కాలనీ చెందిన బాలేష్, నరసింహ, అజయ్, నితిన్, లాలు, తిరుమలేష్ గా గుర్తించారు. అయితే వీరు మద్యం సేవించారా..? డ్రగ్స్ తీసుకున్నారా.? అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
MOST READ :









