Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసిద్దిపేట జిల్లా

Dubbaka : మద్యం మత్తులో దాడి.. నలుగురు యువకుల రిమాండ్..!

Dubbaka : మద్యం మత్తులో దాడి.. నలుగురు యువకుల రిమాండ్..!

దుబ్బాక, మనసాక్షి :

మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులను నలుగురు యువకులు తీవ్రంగా దాడి చేసి గాయపరిచిన ఘటన దుబ్బాక పట్టణ శివారులోని గంగమ్మ గుడి వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారము విష్ణు, మహమ్మద్ రషిద్ అనే ఇద్దరు యువకులు వారి కారులో గంగమ్మ గుడి వద్ద ఉండగా, దుబ్బాక పట్టణానికి చెందిన నలుగురు యువకులు దేవుని రమణ, పరస భాస్కర్, రాచమల్లు వినోద్ అలియాస్ బొమ్మ, ఆలేటి శరత్ అనే నలుగురు యువకులు తీవ్రంగా మద్యం తాగి, లచ్చ పేట నుంచి దుబ్బాకకు కారులో వస్తున్నారు. గంగమ్మ గుడి సమీపంలో ఎదురుగా వస్తున్న కారులో ఉన్న విష్ణు ,మహమ్మద్ రషిద్ లను అడ్డగించి, బీరు బాటిలతో వాళ్లపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దానితోపాటు వారి కారును విచక్షణ రైతంగా ధ్వంసం చేశారు.

ఈ నలుగురి దాడిలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడి స్థానికులు వెంటనే వారిద్దరిని చికిత్స నిమిత్తము తరలించి, దుబ్బాక 100 పడకల ఆసుపత్రికి, అక్కడి నుంచి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మహమ్మద్ రసాద్ భార్య నశ్రీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురు యువకులపై 307 హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని, వారిని రిమాండ్ కు తరలింనట్లు ఏసిపి జి మధు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… దాడి చేసిన నలుగురిపై ఐపీసి సెక్షన్ 307 కింద కేసు చేసి రిమాండ్ చేశారు. అంతేకాకుండా వారిపై రౌడీ షీటర్ ఓపెన్ చేసినట్లుఅన్నారు. ఇట్టి దాడి కక్షలు మనసులో పెట్టుకొని, ఈ దాడి చేసినట్టు పోలీసుల విచారణలో తేలిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక సిఐ పి. శ్రీనివాస్, ఎస్ఐ గంగరాజు, హెడ్ కానిస్టేబుల్ హరిసింగ్, కానిస్టేబుల్ లు రాంజీ, శ్రీనివాస్ , అశోక్
హోంగార్డ్ గణేష్ పాల్గొన్నారు.

ALSO READ : 

BREAKING : నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ప్రైవేట్ క్లినికులపై ఆకస్మిక తనిఖీలు.. 55 మంది ఆర్ఎంపీ, పీఎంపీలపై కేసులు..!

BREAKING : దామరచర్ల వైటిపిఎస్ లో రూ.1.49 కోట్ల విలువైన అల్యూమినియం షీట్ల చోరీ.. చాకచక్యంగా చేదించిన పోలీసులు..!

మరిన్ని వార్తలు