Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

TG NEWS : సర్పంచ్ ఎన్నికల వేళ.. మద్యం రవాణా.. తనిఖీలలో పట్టుకున్న సూర్యాపేట పోలీసులు..!

TG NEWS : సర్పంచ్ ఎన్నికల వేళ.. మద్యం రవాణా.. తనిఖీలలో పట్టుకున్న సూర్యాపేట పోలీసులు..!

సూర్యాపేట, మనసాక్షి :

దూరాజ్ పల్లి ఎక్స్ రోడ్ వద్ద పోలీస్ సిబ్బంది తో వాహనాల తనిఖీ చేస్తుండగా ఏర్టిగా కారును తనిఖీ చేయగా కారులో ఎటువంటి అనుమతులు లేకుండా (11) కటాన్ల ఇంపీరియల్ బ్లూ క్వార్టర్ బాటిల్స్ ను పట్టుకున్నట్టు చివ్వెంల ఎస్ఐ వి.మహేశ్వర్ తెలిపారు.

సూర్యాపేట నుండి మున్యా నాయక్ తండా కు తరలిస్తుండగా కారు డ్రైవర్ ధారవత్ సైదా మరియు అట్టి సరుకు కొనుగోలు చేసిన వ్యక్తి ధరవాత్ నాగు లను విచారించి పంచనామా జరిపి మద్యాన్ని,కారును సీజ్ చేసి చివ్వేంల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

సీజ్ చేసిన మొత్తం మద్యం 528 క్వార్టర్ బాటిల్స్ విలువ లక్ష రూపాయలు వుంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భముగా గ్రామాల యందు ఎవరైనా తమ ఇండ్ల వద్ద గాని షాపుల యందు గాని మరియు మద్యం రవాణా చేసినట్లు ఉంటే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ ఐ హెచ్చరించారు.

MOST READ : 

  1. Miryalaguda : సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ కు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..!

  2. Nalgonda : రూ.300 కోట్లతో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ.. డైరెక్టర్ ఇంటిముందు బాధితుల ఆందోళన..!

  3. Nalgonda : ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్..!

  4. Rythu Bharosa : రైతు భరోసాలో కీలక మార్పులు.. యాసంగి భరోసా వారికే.. బిగ్ అప్డేట్..!

మరిన్ని వార్తలు