E – Garuda Buses | ఎలక్ట్రిక్ గరుడ బస్సుల టైమింగ్.. ! చార్జీ ఎంతటే..?

e – Garuda buses | ఎలక్ట్రిక్ గరుడ బస్సుల టైమింగ్.. ! చార్జీ ఎంతటే..?
హైదరాబాద్ , మన సాక్షి :
అత్యాధునిక సౌకర్యాలతో పాటు కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ఏసి బస్సులను తెలంగాణ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ విజయవాడ మధ్య 10 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఎక్కువ ప్రయాణికులు ప్రయాణించే రూట్ కావడం వల్ల హైదరాబాద్ – విజయవాడ మధ్యలో మొట్టమొదటిసారిగా వీటిని ప్రారంభించారు.
ఈ రూట్ లో ప్రతిరోజు 50వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. వారి సౌకర్యార్థం ఎలక్ట్రిక్ గరుడ బస్సులను తెలంగాణ ఆర్టీసీ ప్రారంభించింది.
మియాపూర్ చౌరస్తాలో 10 కొత్త ఈ గరుడ బస్సులను ప్రారంభించడం జరిగింది. ఈ కొత్త బస్సులు హైదరాబాద్- విజయవాడ మార్గంలో నడుస్తాయి. ఈ ఏడాదిలోగా 50 ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్- విజయవాడ మధ్య నడపనున్నారు. ప్రతి 20 నిమిషాలకు ఒక ఎలక్ట్రిక్ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానున్నారు.
టైమింగ్స్ :
ప్రతి రోజు హైదరాబాద్ లోని మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి 06:30, 08:30, 10.30, 18:10, 19:50, 21:50 గంటలకు ఎంబీజీఎస్ మీదుగా విజయవాడకు బయలుదేరుతాయి.
తిరిగి విజయవాడ నుంచి హైదరాబాదుకు బయలుదేరే సమయాలు. ఉదయం 06:20, 08:00,10:00, 18:40, 20:40, 22:40 గంటలకు హైదరాబాద్ కు నడుస్తాయి.
చార్జి :
ఎలక్ట్రిక్ గరుడ బస్ చార్జి హైదరాబాద్- విజయవాడ మధ్య ఎలక్ట్రిక్ ఆర్టీసీ చార్జీలను తక్కువ చేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు 780 చార్జిగా నిర్ణయించింది. ఈ బస్సులో వైఫైతోపాటు ప్రీమియం సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.